Supreme court : ఉచిత హామీల‌పై సుప్రీంకోర్టు ఆందోళన..నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచన

ఎన్నికల్లో ఉచిత హామీల‌పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.

Supreme court : ఉచిత హామీల‌పై సుప్రీంకోర్టు ఆందోళన..నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచన

Sc Asks Centre Govt To Take Stand On How To Curb Freebies In Polls

Supreme court  : ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు ఉచితంగా అవి ఇస్తాం..ఇవి ఇస్తాం..అది చేస్తాం..ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపిస్తారు ఓటర్లపై. కానీ అధికారంలోకి వచ్చాక అమలులో మాత్రం నామమాత్రంగానే ఉంటాయి. కానీ ఉచితంగా ఇచ్చేది ఏది అయినా సరే తీవ్రమైనది ఇటువంటి హామీలు ప్రమాదకరమైనవి అంటూ ఆందోళన వ్యక్తంచేసింది దేశ అత్యున్నత ధర్మాసం సుప్రీంకోర్టు. ఎన్నిక‌ల్లో ఉచిత హామీల‌ు అనేవి చాలా తీవ్ర‌మైన అంశ‌మ‌ని ఉచితాల‌ను నిరోధించే చ‌ర్య‌ల‌పై ఓ వైఖ‌రితో ముందుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు సూచించింది. ఉచితాలు, ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించిన నిబంధ‌న‌లు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో ఉన్నాయ‌ని..ఉచితాల‌పై నిషేధం విధించే చ‌ట్టాన్ని ప్ర‌భుత్వ‌మే తీసుకురావాల్సి అవసరం ఉందని ఈసీ త‌ర‌పున హాజ‌రైన న్యాయ‌వాది సుప్రీంకోర్టుకు నివేదించారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ఎటువంటి వాగ్ధానం కాద‌ని గ‌తంలో సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీర్పులున్నాయ‌ని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

Also read : Yashwant Sinha: “ఏ పార్టీలో జాయిన్ కాను.. ఎప్పటికీ ఇండిపెండెంట్‌గానే ఉంటా”

ఎన్నిక‌ల్లో ఉచిత హామీల‌పై ఈసీనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కేఎం న‌ట‌రాజ్ అన్నారు. ఈ విష‌యంలో త‌మ‌కు అధికారం లేద‌ని..ఈసీనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని మీరు లిఖిత‌పూర్వ‌కంగా ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ని న‌ట‌రాజ్‌ను ఉద్దేశించి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ ప్రశ్నించారు. ఉచితాల‌పై ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని తెలిపితే వీటిని కొన‌సాగించాలా? లేదా? అనేది తాము నిర్ణ‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా వేరే విషయంపై కోర్టులో కూర్చున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను కూడా సీజేఐ ఈ అంశంపై అభిప్రాయం అడిగారు. “మిస్టర్ సిబల్ సీనియర్ న్యాయవాది కాకుండా సీనియర్ పార్లమెంటేరియన్. దీన్ని నియంత్రించడానికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అని ప్రశ్నించారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ..”ఫైనాన్స్ కమిషన్, ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు చేస్తున్నప్పుడు..ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందో లేదో చూడటానికి ప్రతి రాష్ట్రం రుణాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు” అని సూచించారు.