Delhi Liquor case : మాగుంట రాఘవ బెయిల్ ఉత్తర్వులు సవరించిన సుప్రీంకోర్టు .. జూన్ 12న లొంగిపోవాలని ఆదేశం

ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది.  బెయిల్ రోజులను కుదించింది. దీంతో మాగుంట రాఘవకు షాక్ తగిలింది.

Delhi Liquor case : మాగుంట రాఘవ బెయిల్ ఉత్తర్వులు సవరించిన సుప్రీంకోర్టు ..  జూన్ 12న లొంగిపోవాలని ఆదేశం

magunta raghav reddy

Delhi Liquor case .. magunta raghav reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది.  బెయిల్ రోజులను కుదించింది. తన అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించగా రాఘవ పిటీషన్ పై సానుకూలంగా స్పందించి హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈడీ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాఘవకు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు  ఉత్తర్వులను సవరిస్తు.. జూన్ 12న సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాఘవకు షాక్ తగిలింది.

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత ఫిబ్రవరి 10న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన బెయిల్ కోసం పిటీషన్ వేసినా ఫలితం దక్కలేదు. ఈక్రమంలో రాఘవ 83ఏళ్ల అమ్మమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోవటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో రాఘవ తన అమ్మమ్మ ఆస్పత్రిలో ఉన్నారని ఆమెను చూసుకోవటానికి బెయిల్ కావాలని కోరారు. దీనికి సంబంధించి పిటీషన్ వేయగా దానిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు రెండువారాలు బెయిల్ మంజూరు చేసింది.

హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై ఈడీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరుతు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీంతో రాఘవకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను ఆరురోజులకు కుదిస్తు జూన్ 12న సరెండర్ అవ్వాలని ఆదేశించింది.