Supreme Court: న్యాయవ్యవస్థ కొత్తగా ముందుకు రావాలి.. సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌

కోర్టు ముందు ఏ కేసూ పెద్దది కాదు, ఏ ఒక్క కేసు ప్రత్యేకమైంది కాదు. కోర్టుకు అన్ని కేసులు ముఖ్యమైనవే. ఎందుకంటే ఎక్కువగా వచ్చిన కేసులే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అయినప్పటికీ ప్రజలకు అందాల్సిన న్యాయాన్ని ఎంతో సహనంతో, ప్రాధాన్యతతో విచారించాలి. అప్పుడే సరైన న్యాయం అందుతుంది. రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను కోర్టులు కాపాడతాయి. ఎప్పుడైనా వారి హక్కులకు భంగం కలిగితే కోర్టు ద్వారా వారు పొందుతారు

Supreme Court: వివాదాల సంక్లిష్టత సమస్యను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ కేవలం సంప్రదాయ మార్గాల మీద ఆధారపడితే సరిపోదని, సమూల మార్పులతో కొత్తగా ముందుకు రావాలని సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ అన్నారు. భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. ‘‘న్యాయవ్యవస్థ విఫలమైతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుంది. సంక్షోభాలను మనం విజయవంతంగా ఎదుర్కొంటే సమాజానికి మార్గనిర్దేశం చేయవచ్చు’’ అని అన్నారు. అపారమైన కేసుల భారం ఉండే భారత్‌లో న్యాయమూర్తులు ఎక్కువ శ్రమిస్తుంటారని ఆయన అన్నారు.

BJP vs Congress: ముషార్రఫ్ మరణంపై థరూర్ కామెంట్స్ ఎఫెక్ట్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

ఇక ఇదే కార్యక్రమాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడుతూ ‘‘కోర్టు ముందు ఏ కేసూ పెద్దది కాదు, ఏ ఒక్క కేసు ప్రత్యేకమైంది కాదు. కోర్టుకు అన్ని కేసులు ముఖ్యమైనవే. ఎందుకంటే ఎక్కువగా వచ్చిన కేసులే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అయినప్పటికీ ప్రజలకు అందాల్సిన న్యాయాన్ని ఎంతో సహనంతో, ప్రాధాన్యతతో విచారించాలి. అప్పుడే సరైన న్యాయం అందుతుంది. రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను కోర్టులు కాపాడతాయి. ఎప్పుడైనా వారి హక్కులకు భంగం కలిగితే కోర్టు ద్వారా వారు పొందుతారు’’ అని అన్నారు.

BRS in Nanded: నాందేడ్‭తో బీఆర్ఎస్ నేషనల్ ఎంట్రీ.. గులాబీ జెండా ఎత్తుకోవాలని మరాఠీలకు కేసీఆర్ పిలుపు

ట్రెండింగ్ వార్తలు