Supreme Court : వలస కార్మికుల క్షేమం కోసం సుప్రీం సూచనలు, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దు
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది.

Suprem Court
Migrant Workers : వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది.
వలస కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని..వలస కార్మికుల క్షేమం కోసం ప్రమాణ ఆహార భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించింది. వలస కార్మికులకు సంబంధించి పూర్తి సమాచారం తమకు ఇవ్వాలని హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది.
దీంతో పాటు వలస కూలీలకు భోజనం, నగదు బదిలీ, రేషన్ అందేలా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వారి వారి గ్రామాలకు క్షేమంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ప్రత్యేక రైళ్లు నడపాలని, ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కార్మికుల వద్ద ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని తెలిపింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కొవిడ్ – 19 సెకండ్ వేవ్ ఎంతో మందిని బలి తీసుకొంటోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రధానంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస కార్మికులు పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయంది.
కరోనా ఫస్ట్ వేవ్ లో సొంతూళ్లకు వెళ్లిన ఘటనలు ఇంకా అందరి కళ్ల ఎదుట మెదలుతుంటాయి. మరలా అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. లాక్ డౌన్ విధించడంతో సొంతూళ్లకు వెళ్లాలని అనుకొనే వారు అష్టకష్టాలు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేక…ఫుట్ పాత్ లపై ఉండిపోతున్నారు. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read More : Zimbabwe Man: 16 మంది భార్యలు, 151 మంది సంతానం.. 17వ పెళ్ళికి సిద్ధం