Supreme Court : గుజరాత్ గోద్రా రైలు దగ్ధం కేసు.. 8 మంది నిందితులకు బెయిల్ మంజూరు

నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

Supreme Court : గుజరాత్ గోద్రా రైలు దగ్ధం కేసు.. 8 మంది నిందితులకు బెయిల్ మంజూరు

Supreme Court (1)

Supreme Court : గుజరాత్ లోని గోద్రా-2002 రైలు దగ్ధం కేసులో 8 మంది నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో నలుగురు నిందితులకు బెయిల్ ను తిరస్కరించింది. ఈ కేసులో 8 మంది ఇప్పటికే 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వారికి బెయింల్ మంజూరు చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. తొలుత సోమవారం కేసును విచారించిన సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే నిందితులు ఇప్పటికే 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించింనందున వారికి బెయిల్ మంజూరు చేయాలంటూ వారి తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు. దీంతో సుప్రీంకోర్టు 8 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

Godhra Train Burning Case: గోద్రా రైలు దహనం దోషులకు బెయిల్ ఇవ్వొద్దన్న గుజరాత్ ప్రభుత్వం.. బిల్కిస్ నిందితులకు ఎందుకు ఇచ్చారంటూ విమర్శలు

కాగా, ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు నిందితులకు కోర్టు తిరస్కరించింది. మరోవైపు గుజరాత్ లో 2002లో చెలరేగిన అల్లర్ల సమయంలో నరోదా గామ్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మాయా కొద్నానీ, బజరంగ్ దళ్ కు చెందిన బాబు బజరంగి సహా 60 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు విడుదల చేసింది.

అహ్మదాబాద్ లోని నరోదా గామ్ లో ఇళ్లకు నిప్పు పెట్టి 11 మంది ముస్లింల మరణానికి వీరు కారణమయ్యారని అప్పట్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఈ కేసుపై తుది విచారణ చేపట్టిన అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు 60 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.