Supreme Court Permission : జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. తమిళనాడు ప్రభుత్వ సవరణలను సమర్థించిన ధర్మాసనం

జల్లికట్టు క్రీడల్లో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు ప్రభుత్వం జంతు చట్టంలో సవరణలు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సవరణలను ఆమోదిస్తూనే జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

Supreme Court Permission : జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..  తమిళనాడు ప్రభుత్వ సవరణలను సమర్థించిన ధర్మాసనం

Tamil Nadu jallikattu sport

Tamil Nadu jallikattu sport : తమిళనాడు జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు  అనుమతి ఇచ్చింది. జంతువుల్లో క్రూరత్వ నివారణ చట్టానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించింది. కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగీ, అనిరుద్ధ బోస్, హృషికేశ్ రాయ్, సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

జల్లికట్టు క్రీడల్లో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు ప్రభుత్వం జంతు చట్టంలో సవరణలు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సవరణలను ఆమోదిస్తూనే జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని సర్నోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Jallikattu Competitions : జల్లికట్టు పోటీలకు తమిళనాడు సర్కార్ అనుమతి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహణ

అది సాంప్రదాయ క్రీడ అని, నిబంధనల ప్రకారం ఆ క్రీడకు అనుమతి ఇస్తున్నామని కోర్టు తెలిపింది. అలాగే, కర్ణాటకలో జరిగే కంబాలా, బుల్ కార్ట్ రేసింగ్ లకు కూడా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడులో పాపులర్ అయిన జల్లికట్టు క్రీడపై 2014మేలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జంతు చట్టాలను ఉల్లంఘించినట్లు అప్పట్లో కోర్టు పేర్కొంది. జల్లికట్టు క్రీడ తమిళనాడు సంప్రదాయం కాదని వెల్లడించింది. తమిళనాడు జల్లికట్టు నియంత్రణ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.

కాగా, పీసీఏ చట్టం నుంచి జల్లికట్టు క్రీడను తొలగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత 2017లో తమిళనాడు ప్రభుత్వం కొత్త జంతు చట్టాన్ని రూపొందించింది.
ఆ నోటిఫికేషన్లు, సవరణలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కేసులు దాఖలు చేశారు. అయితే ఆ చట్టాలు ఆర్టికల్ 51ఏ(జీ), 51ఏ(హెచ్)ను ఉల్లంఘించలేదని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను కూడా అతిక్రమించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.