నేనలా అనలేదు..అత్యాచార కేసులో వివాదాస్పద వ్యాఖ్యలపై సీజేఐ వివరణ

గత వారం..ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. న్యాయవాదుల, హక్కుల సంఘాలు,సామాన్యుల నుంచి బోబ్డే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అత్యాచార బాధితురాలిని వివాహనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అని సీజేఐ బోబ్డే కోర్టులో నిందితుడిని ప్రశ్నించినట్లు అన్ని మీడియాలో వార్తలు రావడమే ఈ వివాదానికి కారణం.

నేనలా అనలేదు..అత్యాచార కేసులో వివాదాస్పద వ్యాఖ్యలపై సీజేఐ వివరణ

cji bobde గత వారం..ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. న్యాయవాదుల, హక్కుల సంఘాలు,సామాన్యుల నుంచి బోబ్డే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అత్యాచార బాధితురాలిని వివాహనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అని సీజేఐ బోబ్డే కోర్టులో నిందితుడిని ప్రశ్నించినట్లు అన్ని మీడియాలో వార్తలు రావడమే ఈ వివాదానికి కారణం.

అయితే అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పాటు సీజేఐ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకోవడంతో ఈ వివాదంపై జస్టిస్ బొబ్డే స్వయంగా స్పందించారు. అత్యాచారానికి గురై గర్భవతి అయిన ఓ మైనర్ బాలిక అబార్షన్ కోసం అనుమతి కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం(మార్చి-8,2021) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఏ బోబ్డే ఇటీవలి తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై స్పందించారు.

తన వ్యాఖ్యలు మీడియాలో తప్పుగా నివేదించడం జరిగిందని బొబ్డే తెలిపారు. బాధితురాలిని పెళ్లి చేసుకోమని తాను నిందితుడిని కోరలేదని..నువ్వు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నావా? అని మాత్రమే నిందితుడిని అడిగామని.. అంతే తప్ప నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిందితుడితో తాము చెప్పలేదని బోబ్డే తెలిపారు. అసలు విషయాలు ఇలా ఉండగా మీడియాలో అందుకు విరుద్ధంగా వార్తలు ప్రచురితమయ్యాయని సీజేఐ బొబ్డే తెలిపారు. సుప్రీంకోర్టు మహిళలకు ఎప్పుడూ అత్యున్నత గౌరవం ఇచ్చిందన్నారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సీజేఐ వ్యాఖ్యలతో ఏకీభవించారు. నిజానికి చీఫ్ జస్టిస్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరుగా ఉందన్నారు. సీజేఐ ఆదేశాల మేరకు తుషార్ మెహాతా ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 165లోని అంశాలను కోర్టులో చదివి వినిపించారు. సెక్షన్ 165 ప్రకారం కేసుకు సంబంధించిన ఆధారాలు రాబట్టేందుకు నిందితుడిని ఎటువంటి ప్రశ్నలైనా అడగే అధికారం న్యాయమూర్తులకు ఉందన్న విషయాన్ని తుషార్ మెహతా గుర్తు చేశారు. న్యాయమూర్తులు ఈ కేసులో అలా ప్రశ్నించడం సబబుగానే ఉన్నదని, అయితే వ్యాఖ్యలు సందర్భోచితంగా విస్తృతంగా నివేదించబడ్డాయని మెహతా చెప్పారు.

అసలేంటీ కేసు

మ‌హారాష్ట్ర విద్యుత్తు శాఖ‌ ఉద్యోగి మోహిత్ సుభాష్ చ‌వాన్‌ కొన్నేళ్ల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బెయిల్ కోరుతూ అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ సందర్భంగా సీజేఐ బోబ్డే..నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటే మేం మీకు హెల్ప్ చేస్తాం, లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవాల్సి వ‌స్తుంది. జైలు శిక్ష కూడా ప‌డుతుంది అని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. అత్యాచారానికి పాల్పడిన ఒక నేరస్తుడిని పట్టుకుని బాధితురాలిని పెళ్లి చేసుకోమని అడగడమేంటని చాలామంది ప్రశ్నించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. సీజేఐ రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. దీంతో సీజేఐ బోబ్డే దీనిపై స్వయంగా వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితిొ ఏర్పడింది.