పోక్సో చట్టంపై తీర్పు : మహిళా జడ్జీకి పదోన్నతి విషయంలో సుప్రీం వెనక్కి ?

పోక్సో చట్టంపై తీర్పు : మహిళా జడ్జీకి పదోన్నతి విషయంలో సుప్రీం వెనక్కి ?

POCSO

Supreme Court Holds Bombay HC Judge’s Confirmation : ‘పోక్సో’ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్‌ పుష్ప గనేడివాలా. ఈమెకు పర్మినెంట్ స్టాటస్ ఇవ్వాలనే అంశంపై సుప్రీంకోర్టు పునరాలోచనలో పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. శరీరాన్ని శరీరం తాకలేదు గనుక నేరంగా పరిగణించలేమనడం సహా.. ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్‌ తెరచినా ఈ చట్టం కింద అదేమీ నేరం కాదని ఆమె ఇచ్చిన తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. పదోన్నతి కల్పించే అవకాశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం విరమించుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బాంబే హైకోర్టులో శాశ్వత జడ్జిగా ఉండేందుకు నాగ్ పూర్ బెంచ్ కు చెందిన జస్టిస్ పుష్పకు ఛాన్స్ దక్కింది.

కొలీజియం ఈ అంశంలో తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ‌, రోహింటన్ ఫాలీ నారీమ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌కు చెందిన న్యాయ‌మూర్తులు డీవై చంద్ర‌చూడ్‌, ఏంఎ ఖాన్‌విల్క‌ర్‌ల ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సుప్రీం కొలీజియం వెల్ల‌డించింది. పోక్సో చ‌ట్టం కింద మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న‌వారిని ఒక వారం రోజుల్లోనూ నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ జస్టిస్‌ పుష్ప గనేడివాలా వివాదాస్ప‌ద తీర్పులు ఇచ్చారు. దీంతో ఆమె ప‌ర్మ‌ినెంట్ స్టాట‌స్‌కు బ్రేక్ ప‌డింది.