Pegasus : పెగాసస్ అంశంపై సుప్రీం కీలక తీర్పు

రాజకీయంగా రచ్చ రేపిన పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Pegasus : పెగాసస్ అంశంపై సుప్రీం కీలక తీర్పు

Pegasus

Pegasus : రాజకీయంగా రచ్చ రేపిన పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై నిజనిర్ధారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్వీ రవీంద్రన్ ఆధ్వర్యంలో ఎక్స్ పర్ట్ కమిటీని ఏర్పాటుచేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

కమిటీలోని ఆ ముగ్గురు వీళ్లే

  1. RV రవీంద్రన్- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
  2. అలోక్ జోషి
  3. సందీప్ ఒబెరాయ్

పెగాసస్ అంశంలో తదుపరి వాదనలను 8 వారాల తర్వాత వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ లోగా ఈ అంశంపై పూర్తి నివేదికను కోర్టు ముందు ఉంచాలని నిపుణుల కమిటీకి సూచించింది. పెగాసస్ అంశంలో వాస్తవాలేంటో నిపుణుల కమిటీనే తేలుస్తుందని సుప్రీం తెలిపింది. మొత్తం ఏడు అంశాలపై ఎక్స్ పర్ట్ కమిటీ విశ్లేషణ చేస్తుందని సూచించింది. నిపుణుల కమిటీ ఏర్పాటుపై  కేంద్రప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదని కోర్టు తెలిపింది. ఎక్స్ పర్ట్ కమిటీ ఫంక్షనాలిటీని సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలిస్తుందని తెలిపింది.

Pegasus Scandal : దీదీ కీలక నిర్ణయం..పెగాసస్ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు

పెగాసస్ SpyWare టెక్నాలజీ ఉపయోగించి.. తమ మొబైల్ ఫోన్లపై, ఇంటర్నెట్ అకౌంట్లపై కేంద్రం నిఘా పెట్టిందని.. దీంట్లో నిజానిజాలు నిగ్గుతేల్చాలంటూ ప్రతిపక్షాలు వేసిన  పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఇండిపెండెంట్ కోర్ట్ మానిటరింగ్ దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పిటిషన్ లో కోర్టును కోరాయి.

తీర్పు సందర్భంగా కోర్టు పలు కీలక కామెంట్స్ చేసింది. “మనం అందరం సమాచార యుగంలో బతుకుతున్నాం. ఇక్కడ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే సమయంలో.. జర్నలిస్టులు ఒక్కరే కాదు.. సామాన్య పౌరుల ప్రైవసీని కాపాడటం కూడా చాలా ముఖ్యం” అని సుప్రీం త్రిసభ్య బెంచ్ తెలిపింది.

Pegasus Project : కలవరపెడుతున్న పెగాసస్ స్పైవేర్, ప్రముఖుల ఫోన్లు హ్యాక్ ?