Supreme Court : 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసిన సుప్రీంకోర్టు

గత ఏడాది జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రిసైడింగ్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.

Supreme Court : 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసిన సుప్రీంకోర్టు

Bjp Mlas

lifts suspension of 12 BJP MLAs : సుప్రీంకోర్టులో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. మహారాష్ట్రకు చెందిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ విధించిన సస్పెన్షన్ ను ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఇచ్చిన తీర్మానాన్ని ఉన్నత ధర్మాసనం తోసిపుచ్చింది. 12మంది బీజేపీ ఎమ్యెల్యేల‌పై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్‌ను కొట్టివేసింది. ఈ కాలంలో కోల్పోయిన జీత‌భ‌త్యాలు, ప్ర‌యోజ‌నాలు వారికి ఇవ్వాల‌ని ఆదేశించింది.

గత ఏడాది జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రిసైడింగ్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు చివరికి న్యాయ పోరాటంలో గెలిచారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు తెలిపింది.

Supreme Court : ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఒక కారణంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేరని తెలిపింది. ఇది రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, ద్వేష‌పూరిత చ‌ర్య అని తీర్మానాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం ప్ర‌కారం అసెంబ్లీ సీటు ఆరు నెల‌ల కంటే స‌మ‌యం ఖాళీగా ఉండొద్దు, అలాంటిది ఏడాదిపాటు ఎలా స‌స్పెండ్ చేస్తార‌ని ప్ర‌శ్న‌ించింది. ఏడాదిపాటు స‌స్పెన్ష‌న్ అంటే కేవ‌లం స‌భ్యుడిని శిక్షించ‌డ‌మే మాత్ర‌మే కాదు, ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కూడా శిక్షించ‌డ‌మే అవుతుందని పేర్కొంది.

స‌స్పెన్ష‌న్ అనేది బ‌హిష్క‌ర‌ణ కంటే దారుణం, ప‌ద‌వి ర‌ద్దైతే ఆర్నెళ్ల‌లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంటుందని తెలిపింది. ఇది ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాదమని పేర్కొంది. ఓటింగ్ స‌మ‌యంలో మెజారిటీని తారుమారు చేయ‌డానికి ఇలాంటి ప‌ద్ధతులు అనుసరించే అవ‌కాశ‌ముందని వెల్లడించింది. అసెంబ్లీ నిబంధ‌న‌ల ప్ర‌కారం 60 రోజుల‌కు మించి స‌స్పెండ్ చేయ‌కూడ‌దని తెలిపింది.

Karvy MD Parthasarathy : కార్వీ ఎండీ, సీఎఫ్ఓ ఈడీ కార్యాలయానికి తరలింపు

రాజ్యాంగ‌లోని ఆర్టిక‌ల్ 190(4) ప్ర‌కారం అనుమ‌తి లేకుండా 60రోజుల‌కు మించి స‌భ‌కు హాజ‌రు కాకుంటే ఆ సీటును ఖాళీ అయ్యింద‌ని ప్ర‌క‌టిస్తారని పేర్కొంది. అలాంటిది ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ చెల్లుబాటు కాదని, సెష‌న్‌కు మించి స‌స్పెన్ష‌న్ విధిస్తే దాని హేతుబ‌ద్ద‌త‌పై అనేక అనుమానాలు, ప్ర‌శ్న‌లు వ‌స్తాయని అభిప్రాయ పడింది.

స్పీకర్ చాంబర్ లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్ తో బీజేపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ కారణంగా వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.