ఫేక్ న్యూస్‌పై పిటిషన్ : కేంద్రం, ట్విట్టర్‌కు సుప్రీం నోటీసులు

ఫేక్ న్యూస్‌పై పిటిషన్ : కేంద్రం, ట్విట్టర్‌కు సుప్రీం నోటీసులు

Supreme Court notice to Centre and Twitter on plea : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచార నియంత్రణకు సంబంధించి కేంద్రానికి ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌ సహా ఇతర సోషల్ ప్లాట్ ఫాంలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ ను తనిఖీ చేసే మెకానిజం ఉండేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత వినిత్ గోయింకా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో సర్క్యూలేట్ అయ్యే కంటెంట్ ను రెగ్యేలేట్ చేసేలా మెకానిజం ఉండాలని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా యాంటీ ఇండియా, విద్వేషపూర్వక వ్యాఖ్యలు వంటి విష ప్రచారాలుపై కూడా నియంత్రణ ఉండేలా కేంద్రం, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు ఆదేశాలవ్వాలని పిటిషన్ లో కోరారు. గోయింకా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇతర పిటిషన్లను కూడా జత చేసింది.