Supreme Court : పెగాసస్ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

పెగాసస్ వివాదంపై విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో అనవసర చర్చలు పెట్టొద్దంటూ పిటిషినర్లకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత చెప్పాలి అనుకున్నది కోర్టులోనే చెప్పాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు.

Supreme Court : పెగాసస్ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court

Supreme Court : పెగాసస్ వివాదంపై విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో అనవసర చర్చలు పెట్టొద్దంటూ పిటిషినర్లకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత చెప్పాలి అనుకున్నది కోర్టులోనే చెప్పాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు.

ఈ వ్యవహారంపై వచ్చిన అన్ని పిటిషన్లపై ఒకే సారి విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు. ఇక ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు హెచ్చరిక జారీచేసింది.

సుప్రీం కోర్టులో విచారణ జరుపుతుండగా సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి ప్రతికూలంగా మాట్లాడటం తగదని తేల్చి చెప్పింది. ఇక మరోవైపు పార్లమెంట్ దీనిపై రచ్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు పెగాసస్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై సభ అనేక సార్లు వాయిదా పడింది.