వీవీప్యాట్ స్లిప్పులను లెక్క పెట్టండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

35 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని,

  • Edited By: vamsi , April 8, 2019 / 07:40 AM IST
వీవీప్యాట్ స్లిప్పులను లెక్క పెట్టండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

35 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని,

సార్వత్రిక ఎన్నికలలో వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు విషయమై నమోదైన కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించాలని, అలాగే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని, అది కుదరదు అన్న ఈసీ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది.

ఎన్నికల్లలో వాడుతున్న ఈవీఎంలలో.. ఏ బటన్ నొక్కినా కూడా కేంద్రంలోని అధికార బీజేపీకే ఓట్లు పడుతున్నాయంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ యేతర పార్టీల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.అయితే సుప్రీం కోర్టు ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ఈసీని కోరిన సందర్భంలో అందుకు ఆరు రోజులు పడుతుందని, అలా చేయడం కుదరదు అంటూ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆరు రోజులైని పర్లేదని, వీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని విపక్షాలు కోరాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఇవాళ(8 ఏప్రిల్ 2019) తీర్పు వెల్లడించింది.
Read Also : తోట త్రిమూర్తులకు పవన్ హెచ్చరిక : అన్నయ్య మాటే విన.. మీ మాట వింటానా ?