IPC Sec 124(A) : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు.. ఇంకా ఆ చట్టం ఎందుకు?

ఐపీసీ సెక్షన్ 124 (ఏ) రాజద్రోహం చట్టంను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఈ చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుందని ఇంకా ఈ చట్టంతో పనేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

IPC Sec 124(A) : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు.. ఇంకా ఆ చట్టం ఎందుకు?

Ipc Sec 124(a)

IPC Sec 124(A) : ఐపీసీ సెక్షన్ 124 (ఏ) రాజద్రోహం చట్టంను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఈ చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుందని ఇంకా ఈ చట్టంతో పనేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

గాంధీ, బాలగంగాధర్ తిలక్ లపై బ్రిటిష్ వాళ్ళు ప్రయోగించిన చట్టమని.. దీనితో ఇప్పుడు ప్రయోజనం ఏంటని, వ్యక్తులు వ్యవస్థ స్వేచ్ఛను రాజద్రోహం చట్టం అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గిందని తెలిపారు. ఈ చట్టాన్ని నిరుపయోగం చేస్తూ అమాయకులపైన కేసులు పెట్టె అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ చట్టం దుర్వినియోగం కాకూడదు అన్నదే తమ ఉద్దేశమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై అటార్నీ మాట్లాడుతూ దీనిని కొట్టేయాల్సిన అవసరం లేదు కొన్ని మార్గదర్శకాలు నిర్దేశిస్తే సెక్షన్ 124 (ఏ) చట్టపరమైన ప్రయోజనాలను కలగజేస్తుందని కోర్టుకు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే 2010-2020 మధ్య 11 వేలమందిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.