బాబ్రీ తీర్పు ఇచ్చిన మాజీ జడ్జికి సెక్యూరిటీ పొడిగింపుకు సుప్రీం నిరాకరణ

  • Published By: venkaiahnaidu ,Published On : November 2, 2020 / 01:28 PM IST
బాబ్రీ తీర్పు ఇచ్చిన మాజీ జడ్జికి సెక్యూరిటీ పొడిగింపుకు సుప్రీం నిరాకరణ

Supreme Court Refuses Security To Ex-Judge 28ఏళ్ల బాబ్రీ మసీదు ధ్వంసం కేసులో తీర్పు వెలువరించిన మాజీ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి సెక్యూరిటీని పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 28ఏళ్ల నాటి బాబ్రీ కేసులో సెప్టెంబర్-30న లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.



ఈ హై ప్రొఫైల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ వ్యవస్థాపకులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషి సహా 32మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్రకుమార్ యాదవ్ తీర్పు వెలువరించారు. వాస్తవానికి, సురేంద్రకుమార్ యాదవ్ 2019లోనే రిటైర్డ్ కావాల్సి ఉంది. అయితే, 2015నుంచి బాబ్రీ కేసును సురేంద్ర కుమార్ విచారిస్తున్న నేపథ్యంలో మళ్లీ కొత్త జడ్జి వస్తే విచారణలో మళ్లీ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఆయన గడవును సుప్రీంకోర్టు పొడిగించింది.



https://10tv.in/pocso-court-delivers-justice-in-22-days-ensures-rapist-never-walks-out-alive/
ఆఫీసులో తన చివరి రోజులై సెప్టెంబర్-30న బాబ్రీ కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పుని వెలువరించారు సురేంద్రకుమార్ యాదవ్. ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులందరూ మసీదును కూల్చివేస్తున్న ప్రజలను నిలువరించేందుకు ప్రయత్నించారంటూ ఆయన తీర్పులో పేర్కొన్నారు. అయితే,ఈ కేసులోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తన వ్యక్తిగత సెక్యూరిటీ పొడిగించాలని సురేంద్రకుమార్ యాదవ్ సుప్రీంకోర్టుని అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో ఆయనకు సెక్యూరిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.