Supreme Court: రూ.2 వేల నోట్ల మార్పిడి పిటిషన్.. అత్యవసర విచారణ జరపం: సుప్రీంకోర్టు

వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Supreme Court: రూ.2 వేల నోట్ల మార్పిడి పిటిషన్.. అత్యవసర విచారణ జరపం: సుప్రీంకోర్టు

supreme court

Supreme Court – 2,000 notes: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడికి అవకాశం కల్పించకూడదంటూ సుప్రీంకోర్టులో ఇటీవల న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. నేరస్థులు, ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు, నల్లధనం దాచిన వారు రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకుంటారని, గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని అశ్విని కోరారు.

అత్యవసరంగా తన పిటిషన్ ను విచారించాలన్నారు. అయితే, దీనిని అత్యవసర విచారణకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు ఇవాళ తెలిపింది. వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులోనూ అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఐడీ ఫ్రూఫ్ లేకుండా నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తుండడంపై అభ్యంతరాలు తెలిపారు. అవినీతి నిరోధక చట్టాలకు ఇది వ్యతిరేకమని అన్నారు. అయితే, ఆయన పిటిషన్ ను ఇటీవలే హైకోర్టు కొట్టేసింది. దీంతో అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఐడీ ఫ్రూఫ్ సమర్పించకుండా, ఎలాంటి ఫార్మ్‌ నింపకుండానే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్‌ చేసుకోవచ్చని ఆర్బీఐ, ఎస్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
Arvind Kejriwal: మొన్న కేసీఆర్‌తో.. ఇప్పుడు అదే విషయంపై స్టాలిన్‌తో కేజ్రీవాల్..