Delhi Government: కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పబ్లిక్ ఆర్డర్స్, ల్యాండ్ మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

Delhi Government: కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court ruled

Delhi Government: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం. కేంద్ర జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనా సేవలను ఎవరు నియంత్రించాలనే అంశంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అవసరమని పేర్కొంది. సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన, కార్యనిర్వాహక అధికారులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పబ్లిక్ ఆర్డర్స్, ల్యాండ్ మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

ఢిల్లీలోని శాసనసభ, ప్రభుత్వం పనితీరుకోసం ఒక ఫ్రేమ్ వర్క్‌ను అందించడానికి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్‌సీటీడీ) చట్టం 1991 అమల్లోఉంది. అయితే, ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసుల పై కేంద్రానికే నియంత్రణ ఉంటుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ కు అదనపు అధికారాలు ఇచ్చారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎల్జీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

Rishi Sunak : చిన్నపాటి దూరానికే హెలికాప్టరా? ప్రజాధనాన్ని వేస్టుచేస్తున్నారని రిషి సునాక్‌పై విమర్శలు

దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సానుకూల ఫలితం రాకపోవటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2019 ఫిబ్రవరి 14న సుప్రింకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ వివాదంపై భిన్నమైన తీర్పులు ఇచ్చింది. అనంతరం ఈ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపారు. ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సీఫార్సు చేస్తున్నట్లు గత ఏడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం గురువారం తీర్పు వెలురించింది.

Chandra Mouli: విధి వక్రించినా పట్టుదలతో పైకొచ్చాడు.. ఐఐఎం సీటు సాధించిన దివ్యాంగుడు..

కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది..
సుప్రీంకోర్టు తాజా తీర్పు కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బే. ఈ తీర్పుపై కేంద్రం రివ్యూ పిటీషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రివ్యూ పిటీషన్ పైకూడా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే అప్పుడు క్యూరేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేయవచ్చు. దీనికితోడు పార్లమెంట్‌లో చట్టం తీసుకురావడం ద్వారా దానిని మార్చే అవకాశం కేంద్రానికి ఉంది. ఈ చట్టాన్ని మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.

సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేజ్రీవాల్ హర్షం
ఢిల్లీలో పరిపాలన అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరగనుందన్నారు.