supreme court : 18 ఏళ్లు దాటితే..వాళ్లకు ఇష్టమైన మతం ఎంచుకోవచ్చు : సుప్రీంకోర్టు

supreme court : 18 ఏళ్లు దాటితే..వాళ్లకు ఇష్టమైన మతం ఎంచుకోవచ్చు : సుప్రీంకోర్టు

Sc Says Person Above 18 Free To Choose Religion

SC Says person above 18 free to choose religion : మత మార్పిడిలకు సంబంధించి భారత దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతం ఎంచుకోవచ్చు (వారికి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు) అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పిడిలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు అని ధర్మాసనం స్పష్టం చేస్తూ..చేతబడి, మతమార్పిడిలను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిన్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గావై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

అశ్వినీ ఉపాధ్యాయ తరఫున సీనియర్ న్యాయవాది.. గోపాల్ శంకరనారాయణ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఆయన చేసిన వాదనలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 ప్రకారం ఇది ఏ రకమైన పిటిషన్ అని ప్రశ్నించింది. ఇటువంటి వాదనలు చేసిన న్యాయవాది గోపాల్ శంకరనారాయణ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది.

అంతేకాదు.. 18 ఏళ్లు దాటినవారు తమకు నచ్చిన మతం ఎంచుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరికీ ఎటువంటి కారణం లేదని జస్టిన్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గావై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలో propagate అనే పదం ఉండటానికి ఒక కారణం ఉందని ఈ సందర్భంగా ధర్మానం తెలిపింది.

సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించడానికి న్యాయవాది గోపాల్ శంకరనారాయణ అనుమతి ఇవ్వాలని అడిగారు. ఈ పిటిషన్‌ను ప్రభుత్వానికి, న్యాయ కమిషన్‌కు నివేదించడానికి కూడా అనుమతి కోరారు. దీనిపై అనుమతి ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.

అడ్వకేట్ అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌లో మత దుర్వినియోగాన్ని తనిఖీ చేయడానికి, మత మార్పిడి చట్టాన్ని రూపొందించడానికి ఒక కమిటీనికి నియమించటానికి గల సాధ్యాసాధ్యాలను నిర్ధారించాలని కోరారు. బలవంతపు మతమార్పిడిలు, అలాగే డబ్బులు ఇచ్చి వారిని ఒప్పించి జరుపుతున్న మత మార్పిడిలు ఆర్టికల్స్ 14, 21, 25 విరుద్దంగా ఉన్నాయని..సెక్యూలరిజం మూల సూత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఆర్టికల్స్ 14, 21, 25 అంతర్భాగమని పిటిషన్‌లో పొందుపరిచారు.