Pegasus: పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. నేడే విచారణ

ఇవాళ(5 ఆగస్ట్ 2021) పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులుతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌. రామ్‌, శశి కుమార్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Pegasus: పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. నేడే విచారణ

Supreme Court

Supreme Court To Hear Batch Of Pleas On Pegasus Row Today:ఇవాళ(5 ఆగస్ట్ 2021) పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులుతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌. రామ్‌, శశి కుమార్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

పెగాసస్ వివాదంపై చర్చ జరపాలని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పట్టుబుడుతూ ఉండగా.. వాదోపవాదాలు, నిరసనలు, వాగ్వాదాలతో పార్లమెంట్ స్తంభింస్తోంది. ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేసినా కేంద్రం మాత్రం పట్టించుకోట్లేదు. పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని అంటుంది. అయితే, దేశవ్యాప్తంగా 300 మందిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం నిఘా పెట్టిందని అంటున్నారు. వీరిలో ప్రతి పక్షాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, హక్కుల సంఘాల నేతలు, జర్నలిస్టులు, లాయర్లు ఉన్నారనేది ప్రతిపక్షాల వాదన. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా ది వైర్ ఇప్పటికే ప్రచురించింది.

అయితే రీసెంట్‌గా వెల్లడించిన వివరాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరి ఫోన్లూ హ్యాకింగ్ జాబితా కూడా ఉండడం గమనార్హం. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పాత ఫోన్ నెంబర్, మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నెంబర్ కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్టు తెలిపింది.