Supreme Court: జడ్జీల నియామకంలో కొలీజియంను సమర్ధించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి సూటి సమాధానం

పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. "కొలీజియం నిర్ణయాలు ఆర్‭టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. ఆర్‭టీఐ కింద ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? ఆర్‭టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు, సుప్రీంకోర్టు వెనక్కి తగ్గుతోంది. ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వానికి మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి" అని అన్నారు.

Supreme Court: జడ్జీల నియామకంలో కొలీజియంను సమర్ధించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి సూటి సమాధానం

Supreme Court upholds collegium in appointment of judges

Supreme Court: ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో జడ్జీల నియామకంలో కొలీజియం వ్యవస్థను సుప్రీం కోర్టు సమర్ధించింది. జడ్జీల నియామకం అత్యంత నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతోందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనిపై మరో ప్రశ్న అవసరం లేదని, అనుమానం అసలే ఒద్దని జస్టిస్ ఎంఆర్ షా, సిటీ రవికుమార్‭లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు.. కేంద్ర ప్రభుత్వానికి సూటి సమాధానాలుగానే భావించవచ్చు.

2018 నాటి కాంట్రవర్శియల్ కొలీజియం సమావేశాన్ని సవాల్ చేస్తూ సమాచార హక్కు చట్టం (ఆర్‭టీఐ) చట్టం కిందకు కొలీజియం సమావేశాలు, నిర్ణయాలను విడుదల చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సామాజికవేత్త అంజలి భరద్వాజ్. అక్కడ ఈ కేసు విచారణను డిస్మిస్ చేయడంతో, ఆమె దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కారు.

Congress U-Turn: మల్లికార్జున ఖర్గే విషయంలో మాట తప్పిన కాంగ్రెస్.. ఉదయ్‭పూర్ తీర్మానంపై యూటర్న్

పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. “కొలీజియం నిర్ణయాలు ఆర్‭టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. ఆర్‭టీఐ కింద ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? ఆర్‭టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు, సుప్రీంకోర్టు వెనక్కి తగ్గుతోంది. ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వానికి మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి” అని అన్నారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ముందుగా 2018 నాటి వివాదాస్పద కొలీజియం సమావేశంపై సుప్రీం స్పందిస్తూ ‘‘ఆ కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం జరగలేదు. మాజీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మేము వ్యాఖ్యానించదలచుకోలేదు. కొలీజియం నిర్ణయాలపై మాజీ సభ్యులు వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది’’ అని పేర్కొంది. ఇక కొలీజియంపై స్పందిస్తూ ‘‘జడ్జీల నియామకం అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. పనిచేసే వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు. కొలీజియం తన పనిని చేయనివ్వండి. మాది అత్యంత పారదర్శకమైన సంస్థ’’ అని పేర్కొన్నారు.

Anti-Brahmin: జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ వీసీ

ఈ విషయంలో తాము వెనక్కి తగ్గడం లేదని చెప్పిన సుప్రీం.. మౌళిక నిర్ణయాలు చాలా తీసుకుంటామని పేర్కొంది. అనంతరం శుక్రవారం విచారణ సందర్భంగా ఇచ్చిన తీర్పును సుప్రీం రిజర్వులో పెట్టింది. డిసెంబరు 12, 2018న సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం ఎజెండా, మినిట్స్, తీర్మానాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ దాఖలైన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దానికి ముందు, కేంద్ర సమాచార కమిషన్ సహా పలు స్థాయిల్లో ఈ అభ్యర్థన తిరస్కరించబడింది.

అంజలి భరద్వాజ్ తన పిటిషన్లలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆత్మకథ నుండి ‘జస్టిస్ ఫర్ ది జడ్జి’ అనే శీర్షికతో ఒక సారాంశాన్ని ఉదహరించారు. దీనిలో అతను డిసెంబర్ 2018 సమావేశంలో కొలీజియం సమావేశంలో సుప్రీంకోర్టుకు మొదట రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రదీప్ నందజోగ్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ పేర్లను సిఫారసు చేసినట్లు రాసుకొచ్చారు. అయితే వీరిద్దరూ కాకుండా జనవరి 10, 2019 నాటి తన తీర్మానంలో వీరిని ఆమోదించడం లేదని తీర్మానం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

India at UN: ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో మాకు పాఠాలు చెప్పొద్దు.. ఐక్యరాజ్య సమితిలో భారత్