Stray Dog Menace: వీధి కుక్కలు కరిస్తే ఆహారం అందించే వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు

వీధి కుక్కలకు ఆహారం అందించే వారు... ఇకపై అవి ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సూచించింది భారత సుప్రీంకోర్టు. వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలని ఆదేశించింది.

Stray Dog Menace: వీధి కుక్కలు కరిస్తే ఆహారం అందించే వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు

Stray Dog Menace: వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే ఇకపై వాటికి ఆహారం అందించే వారిదే బాధ్యత అని వ్యాఖ్యానించింది భారత సుప్రీంకోర్టు. కేరళలో ఇటీవలి కాలంలో కుక్కల దాడులు పెరిగిపోయిన అంశంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత నాలుగు నెలల కాలంలో కేరళలో వీధి కుక్కల దాడుల కారణంగా ఏడుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Karnataka Govt: ఏసీబీని రద్దు చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఇకపై అవినీతి కేసులన్నీ లోకాయుక్తకే

వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండటంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేకే మహేశ్వరితో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే వారికి ఆహారం అందించే వారిదే బాధ్యత. బాధితులకు జరిగే నష్టానికి కూడా బాధ్యత వహించాలి. కుక్కల వ్యాక్సినేషన్ విషయంలో కూడా వారే బాధ్యత తీసుకోవాలి. వీధి కుక్కల్ని సంరక్షించే వారు వాటిని స్పెషల్‌గా మార్క్ చేయడమో లేదా నెంబర్లు వేయడమో చేసి బాధ్యత తీసుకోవాలి’’ అని కోర్టు సూచించింది. వీధి కుక్కలు ఆహారం లేనప్పుడు లేదా ఏదైనా జబ్బు సోకినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తూ దాడులు చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో అనేక కుక్కలు రేబిస్ బారిన పడుతున్నాయి.

Father kills son: దుబాయ్ నుంచి వచ్చిన కొడుకును చంపిన తండ్రి.. కారణమేంటంటే

అందుకే అలాంటి కుక్కలను ప్రత్యేకంగా పరిరక్షించాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. వీధి కుక్కల సంరక్షణ విషయంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కల్ని సంరక్షించడం ఎంత అవసరమో.. అమయాక ప్రజలు వాటి బారిన పడకుండా చూడటం కూడా అంతే అవసరమని అభిప్రాయపడింది. మరోవైపు.. వీధి కుక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మున్సిపల్, పంచాయతీల పరిధిలో ఉండే కుక్కలకు ఆహారం అందేలా చూస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.