చంద్రుడిపై స్థలం కొని..రెండు నెలల కొడుకుకు గిఫ్ట్ ఇచ్చిన వ్యాపారి

చంద్రుడిపై స్థలం కొని..రెండు నెలల కొడుకుకు గిఫ్ట్ ఇచ్చిన వ్యాపారి

Surat Businessman Buys A Land On The Moon For His Two Month Old Son

Surat businessman buys a land on the moon : తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లల కోసమే. పిల్లల కోసం స్థలాలు, పొలాలు, నగలు కొంటారు. కానీ ఓ వ్యాపారి మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. తన రెండు నెలల వయస్సున్న కొడుకు కోసం ఏకంగా చంద్రుడిపైనే స్థలం కొనేశాడు. అలా చంద్రుడిపై స్థలం కొన్న మొదటి సూరత్‌ వ్యాపారిగా రికార్డు కెక్కాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విజయ్‌ భాయ్‌ కథిరియా అనే వ్యాపారి. ఎవరన్నా పిల్లలు మారాం చేస్తే చంద్రుడిని చూపిస్తాం కానీ విజయ్ భాయ్ కథిరియా మాత్రం ఏకంగా తన కొడుక్కి చంద్రుడిపై స్థలమే కొనేశాడు.

తన రెండు నెలల కుమారురు నిత్య కోసం చంద్రుడిపై స్థలం కొనాలనుకున్నాడు. దీని కోసం చేయాల్సిందంతా చేశాడు. చంద్రుడిపై స్థలం కొనటానికి అనుమతుల కోసం న్యూయార్క్‌లోని ఇంటర్‌నేషనల్‌ లూనార్‌ రిజిస్ట్రీకి మెయిల్‌ పెట్టాడు. మార్చి 13వ తేదీన అనుమతులు కూడా వచ్చాయి. సదరు కంపెనీ నుంచి విజయ్‌ రెండు నెలల కొడుకు నిత్య పేరుతో ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికేట్లు కూడా వచ్చేశాయి. అంతే వ్యాపారి విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంద్రుడిపై గల ‘సీ ఆఫ్‌ మస్కోవీ’ అనే ప్రాంతంలో విజయ్ కొడుకుకు స్థలం కేటాయించారు. మామూలుగా చంద్రుడిపై స్థలం సంపాదించటం అంటే మాటలు కాదు. కానీ కొడుకుమీద ఉండే ప్రేమతో విజయ్ చంద్రుడిపై స్థలం కొని చేసి చూపించాడు.

కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..చంద్రుడిపై స్థలం కొనగలం కానీ ఇల్లు కట్టుకోలేం కదా..మరి భవిష్యత్తులో జరగొచ్చే గానీ..ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. కాకపోతే స్థలం కొన్నట్లు ఓ సర్టిఫికేట్‌ను మాత్రమే సంపాదించొచ్చు. అదే చేశాడు వ్యాపారి విజయ్. ఇదొక స్టేటస్ సింబల్ అని కూడా చెప్పొచ్చు. చంద్రుడిపై స్థలం కొన్నామని చెప్పుకోవటాన్ని చాలా మంది దీన్ని ఓ విలువైన బహుమతిగా భావిస్తుంటారు. గతంలో రాజస్తాన్‌కు చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తి చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొని భార్యకు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రుడిపై స్థలం కొనగలం కానీ దాన్ని దగ్గరకెళ్లి చూసుకోలేం. అక్కడ ఇల్లు కట్టుకోలేం…కానీ చంద్రుడిపై మాకు స్థలం ఉంది అని మాత్రం సర్టిఫికెట్ ద్వారా చూపించుకోగలం అంతే..