మూడేళ్ల పాపకు సర్జరీ..కుట్లు వేయకుండానే అప్పగించడంతో మృతి

ఆసుపత్రికి రాగానే..వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ కొంతమంది డాక్టర్లు ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దారుణాలకు తెగబడుతున్నాయి. వైద్యుల క్రూరత్వానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాగే..ఓ వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించారు.

మూడేళ్ల పాపకు సర్జరీ..కుట్లు వేయకుండానే అప్పగించడంతో మృతి

UP Surgeons

without giving stitches : ఆసుపత్రికి రాగానే..వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ కొంతమంది డాక్టర్లు ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దారుణాలకు తెగబడుతున్నాయి. వైద్యుల క్రూరత్వానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాగే..ఓ వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించారు. ఆపరేషన్ చేసిన అనంతరం ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని కుట్లు వేయకుండానే..అప్పగించడంతో…మూడేళ్ల చిన్నారి చనిపోయింది. అత్యంత విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

కౌశాంభి జిల్లాలో మన్ ఝూన్ పూర్ టౌన్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి ఉంది. కొద్ది రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో…ప్రయాగ్ రాజ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పాపను పరీక్షించిన అనంతరం ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు సర్జరీ చేశారు.

అయితే..ఆసుపత్రికి సంబంధించి మొత్తం బిల్లులు చెల్లించలేదని సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే..అప్పగించారు. దీంతో ఆరోగ్యం విషమించి పాప చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో బాహ్య ప్రపంచానికి దారుణ ఘటన తెలిసింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. Prayagraj DM Bhanu Chandra Goswami కమిటీని నియమించారు. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు.