రాహుల్ టీంలో సర్జికల్ స్ట్రైక్స్‌ హీరో

  • Published By: madhu ,Published On : February 21, 2019 / 03:41 PM IST
రాహుల్ టీంలో సర్జికల్ స్ట్రైక్స్‌ హీరో

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్‌లోకి సర్జికల్ స్ట్రైక్స్‌ని లీడ్ చేసిన లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా జాయినైపోయారు. 2016లో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతితో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన టీమ్‌కి హుడా నేతృత్వం వహించారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌నే బిజెపి తమ ప్రభుత్వం ఘనతగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే అలాంటి దాడులకు నాయకత్వం వహించిన డిఎస్ హుడా ఫిబ్రవరి 21వ తేదీ గురువారం సాయంత్రం హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమయ్యారు. పుల్వామా దాడి తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతి భద్రతకి ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఓ విజన్ డాక్యుమెంట్ తయారు చేయిస్తున్నట్లు ప్రకటించారు. 

ఆ డాక్యుమెంట్ రూపకల్పన కోసం ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడా టాస్క్ ఫోర్స్‌ డిఎస్ హుడా నేతృత్వంలో ముందుకు వెళ్లనుంది. డిఎస్ హుడా మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ విజన్ డాక్యుమెంట్‌లో సరిహద్దుల భద్రత. అందుకోసం ఎవరెవరితో చర్చలు జరపాలి అన్న అంశాలు పొందుపరుస్తారు. హుడా నేతృత్వంలోని ఈ నేషనల్ లెవల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ నెల రోజుల్లో తన నివేదిక సమర్పించనుంది.