Indian Student: కెనడాలో ఇండియన్ స్టూడెంట్ హత్య

కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపాడో దుండగుడు. ఆ వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్‌కు..

Indian Student: కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపాడో దుండగుడు. ఆ వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ కు చెందిన బాధితుడు.. జనవరిలో కెనడాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సెయింట్ జేమ్స్ టౌన్ లోని షేర్ బోర్న్ టీటీసీ స్టేషన్‌కు చెందిన గ్లెన్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గురువారం సాయంత్రం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

రిచర్డ్ జొనాథన్ అనే 31ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు పోలీసులు. గత శనివారం మరో హత్యకు పాల్పడటంతో అతణ్ని పట్టుకోవడం పోలీసులకు సులువైంది. ఎలియాజర్ మహేపత్ (35) జార్జ్ స్ట్రీట్ సమీపంలోని డుండాస్ స్ట్రీట్ ఈస్ట్ లో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటనకు పాల్పడ్డాడు.

“హత్యల వెనుక ఉద్దేశ్యం తెలుసుకోవడానికి గానూ అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటివరకూ ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం గమనార్హం. అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం. రెండు హత్యల వెనుక ఉన్న సంబంధాలను వీలైనంత త్వరగా తెలుసుకుంటామ”ని పోలీసులు వెల్లడించారు.

Read Also : కెనడాలో వ్యాన్ ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

ఘాజియాబాద్ లో ఉన్న జితేశ్ వాసుదేవ్ తండ్రి మాట్లాడుతూ.. కెనడాలో సేఫ్టీ ఉంటుందనే అక్కడికి పంపించాం. మూడేళ్లుగా టోరొంటోలోని విద్యాసంస్థలో బాగా చదువుతున్నాడు. రెండు వారాల క్రితమే మెక్సికన్ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ దొరికిందని చెప్పాడు. “వాసుదేవ్ పొలైట్ గా ఉండటమే కాకుండా సెన్సిటివ్, విధేయత కలిగిన వ్యక్తి కూడా. కుటుంబం, స్నేహితులు, ప్రతిఒక్కరూ అతణ్ని ప్రేమిస్తారు” అని బాధితుడి తండ్రి పేర్కొన్నాడు.

క్యాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో ఈ మృతి పట్ల స్పందిస్తూ.. “ఇండియన్ స్టూడెంట్ హత్యకు గురికావడం తెలిసి షాక్ కు గురయ్యాం. ఆ కుటుంబంతో టచ్ లో ఉంటాం. వీలైనంత వరకూ మా సహకారం అందిస్తాం” అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు