Punjab : పంజాబ్‌ కొత్త సీఎం ఎవరు?

పంజాబ్‌ కొత్త సీఎం ఎవరు? అమ‌రీంద‌ర్ సింగ్ తప్పుకోవడంతో ఆ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? ఇదే ఇప్పుడు పంజాబ్‌ పాలిటిక్స్‌ లో హాట్ టాపిక్‌గా మారింది.

Punjab : పంజాబ్‌ కొత్త సీఎం ఎవరు?

Punjab

Suspense over new CM : పంజాబ్‌ కొత్త సీఎం ఎవరు? అమ‌రీంద‌ర్ సింగ్ తప్పుకోవడంతో ఆ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? ఇదే ఇపుడు పంజాబ్‌ పాలిటిక్స్‌ లో హాట్ టాపిక్‌గా మారింది. సిద్ధూ వ‌ర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి ప‌ద‌వి ఇస్తారా?… లేదంటే.. సిద్ధూకే పదవీ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది చర్చనీయాంశమవుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశమైనా.. సీఎల్పీ నేతను ఎన్నుకోలేదు. ఆ బాధ్యతను అధిష్టానానికే అప్పగించారు. దీంతో పంజాబ్‌ సీఎం సీటు ఎవరిని వరించబోతుందన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.

అమరీందర్ రాజీనామా తర్వాత సమావేశమైన పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం… అసలు సీఎల్పీ లీడర్‌ ఎవరన్నదానిపై చర్చే జరపలేదు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే… సిద్దూను ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే తాను వ్యతిరేకిస్తానని ఇప్పటికే అమరీందర్ సింగ్‌ ప్రకటించడంతో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో సీఎం పీఠం ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఆచితూచి అడుగులేస్తోంది.

Punjab Crises: సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్

అమరీందర్‌ రాజీనామా తర్వాత నెక్ట్స్‌ సీఎంగా సిద్ధూ పేరు ఎక్కువగా వినిపించింది. శాసనసభాపక్ష సమావేశంలో ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్న టాక్ వినిపించింది. కానీ అదేదీ జరగలేదు. పైగా మరో ముగ్గురు పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. సీఎం రేసులోకి సునీల్‌ జాఖర్, సుఖ్ జిందర్ సింగ్ రంధావా, ప్రతాప్ సింగ్ బజ్వా పేర్లు వచ్చిచేరాయి. అయితే… ఇందులో సునీల్‌ జాఖర్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సిద్ధూకి బదులు సునీల్​కే సీఎం పీఠం అప్పగిస్తారని పొలిటికల్ టాక్. అధిష్టానం కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆమ్​ఆద్మీ పార్టీ లోతుగా పాతుకుపోతోంది. దీంతో పీసీసీ చీఫ్ పదవి, ముఖ్యమంత్రి పదవులను ఒకే వర్గానికి కాకుండా ఇరువర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్​అధిష్టానం భావిస్తోంది. అయితే.. నవ్యజోత్​సింగ్​సిద్ధూ ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. అందుకే సీఎం పదవిని సిక్కుయేతర వ్యక్తికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సునీల్​ జాఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయననే సీఎంగా ఎన్నుకుంటారని రాజకీయ వర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి.

Punjab : నాకొద్దు ఈ పదవి, సోనియాకు అమరీందర్ లేఖ!

పంజాబ్​లోని పంకోసీ ప్రాంతానికి చెందిన సునీల్​జాఖర్… గతంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశారు. 2002 నుంచి 2017 వరకు అబోహర్ నియోజకవర్గానికి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2015 వరకు పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
2017లో గురుదాస్పూర్ లోక్​సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచాడు. 2019లో అదే స్థానం నుంచి సన్నీడియోల్​పై పోటీచేసి ఓడిపోయారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్​పదవికి సైతం రాజీనామా చేశాడు సునీల్​జాఖర్.

సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా ప్రస్తుతం జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా, జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఈయన కుటుంబానికి కాంగ్రెస్ విడదీయరాని అనుబంధం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్ గా ఉన్నారు. బాదల్ ఫ్యామిలీకి బద్దశత్రువు. కుటుంబపాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. సీఎం రేసులో ఈయన పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ… అన్ని సమీకరణాలు కుదిరితేనే అదృష్టం వరించే అవకాశం ఉంది.

Breast Milk Bank: పంజాబ్‌లో మొదటి తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు..

ఇక సీఎం రేసులో వినిపిస్తున్న మరోపేరు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా. పంజాబ్‌ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ అయిన ప్రతాప్‌సింగ్‌.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఈయన గురుదాస్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పంజాబ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే… ఇటీవల ఈయన బతాల అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అక్కడ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఈయన తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అందుకే.. ప్రస్తుతం సీఎం రేసులో ఈయన పేరు కూడా వినిపిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలు సోనియాకు అప్పగించడంతో ఆమె ఎవరిని ఖరారు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.