లాక్‌డౌన్‌లో లవర్‌ని కలవటానికి అమ్మాయి గెటప్..సూరత్ పోరడి వీరప్రేమ గాథ

  • Published By: nagamani ,Published On : May 27, 2020 / 07:25 AM IST
లాక్‌డౌన్‌లో లవర్‌ని కలవటానికి అమ్మాయి గెటప్..సూరత్ పోరడి వీరప్రేమ గాథ

లాక్‌డౌన్‌లో లవర్‌ని కలిసేందుకు ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది తెలిసినవారు ఔరా..ఏమి వీడి ఆరాటం అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. 

ఈ దొరగారి వీరప్రేమికుడి గాథ ఇలా..సూరత్‌లోని పర్ది పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు.. ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. లాక్‌డౌన్‌ వల్ల ఆ అమ్మాయిని కొద్ది రోజుల నుంచి కలుసుకోలేపోయాడు. కనీసం కంటితో కూడా చూడలేకపోయాడు. పాపం పిలగాడు పిల్లను చూడకుండా ఉండలేకపోయాడు. ఏం చేసైనాసరే ప్రియురాలని కలవాలని నిర్ణయించేసుకున్నాడు. దీంతో ఈ వీరప్రేమికుడు అమ్మాయిలాగా..పంజాబీ డ్రెస్‌ వేసుకుని..ముఖానికి చున్నీతో చుట్టేసుకున్నాడు. స్కూటీపై మంగళవారం తెల్లవారుజామున 2:40 గంటలకు ప్రయాణమయ్యాడు. 

అలా భోస్లపాడ – పరియా రోడ్డుపై వెళ్తున్న ప్రేమికుడిని పోలీసులు ఆపలేదు. కానీ కొంచెం దూరం వెళ్లేసరికి వాళ్లకు డౌట్ వచ్చి ఆపారు. ఈ టైమ్‌లో ఆడపిల్ల వెళ్లటంపై అనుమానం వచ్చిం ఆపారు. ఈ టైమ్ లో ఎక్కడికెళ్తుతున్నావ్? ఎక్కడి నుంచి వస్తున్నావ్? అని ప్రశ్నించారు. ముసుగులోనుంచి పోలీసులకు తడబడుతూ సమాధానం చెప్పాడు. 

అతని వాయిస్ విన్న పోలీసులకు మరింత అనుమానం వచ్చి..గద్దించేసరికి పాపం.. వీరప్రేమికుడికి ‘‘గుండె జారి గల్లంతయ్యింది’ పిలగాడు ఉక్కిరిబిక్కిరైపోయాడు. అగి గమనించిన పోలీసులు సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నారు. గట్టిగా గద్దించేసరికి..బేర్ మంటూ అసలు విషయం చెప్పేశాడు. 

తన లవ్వర్ కలిసేందుకు వెళ్తున్నానని..పోలీసులు ఆపకుండా..మావాళ్లు గుర్తు పట్టకుండా..అంతేకాదు..తన లవ్వర్ తల్లిదండ్రులు కూడా తననకు గుర్తు పట్టకుండా ఉండేందుకు ఇలా అమ్మాయిలా తయారై వెళ్తున్నాననీ చెప్పాడు. 

యువకుడి సమాధానం విని పోలీసులు షాక్‌ అయ్యారు. ఓరీ..నీ దుంప తెగా..ఇదేమన్నా సినిమా అనుకున్నావా ఏంటీ?..పేద పోటుగాడిలా బయల్దేరావ్..అంటూ లాక్‌డౌన్‌ రూల్స్ బ్రేక్ చేసిందుకు సదరు వీరప్రేమికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  సదరు యువకుడు పంజాబీ డ్రెస్ కింద టీషర్ట్ వేసుకున్నాడని గుర్తించారు.  గుజరాత్‌లోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలించినప్పటికీ, కంటెమెంట్ జోన్‌లను మినహాయించి, సాయంత్రం 7 నుంచి ఉదయం 7 గంటల నుండి కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.

Read: స్పీడ్ పోస్టులో తాళి పంపారు.. జూమ్‌లో ఇన్విటేషన్.. తల్లిదండ్రులు చూస్తుండగా పెళ్లి చేసుకున్నారు!