UP Election 2022 : సైకిల్ ఎక్కనున్న స్వామి ప్రసాద్ మౌర్య!

ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. స్వామిప్రసాద్‌ మౌర్య తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని...

UP Election 2022 : సైకిల్ ఎక్కనున్న స్వామి ప్రసాద్ మౌర్య!

Up Sp

Swami Prasad Maurya : యూపీలో ఎన్నికలకు ముందు బీజేపీలో కల్లోలం ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరు రాజీనామాలు చేస్తున్నారు. యోగి మంత్రివర్గం నుంచి వైదొలిగిన స్వామి ప్రసాద్ మౌర్య 2022, జనవరి 14వ తేదీ శుక్రవారం సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నారు. ఈయన జనవరి 11వ తేదీన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత..సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత..యోగి తన కేబినెట్ లో స్వామి ప్రసాద్, దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీలను తీసుకున్నారు. తాను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కలిసినట్లు గురువారం వెల్లడించారు.

Read More : Chiranjeevi : మరోసారి రాజ్యసభకు మెగాస్టార్‌ చిరంజీవి..?

ఆయన సన్నిహితులను తనకు పరిచేశారని, తాను పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తానన్నారు. తనకు ఏ పార్టీ నుంచి కాల్ రాలేదని, ప్రజా సమస్యలపై పని చేసే పార్టీ బీజేపీ కాదని ఆయన ఓ జాతీయ ఛానెల్ తో వెల్లడించారు. మరలా తిరిగి బీజేపీలోకి వచ్చే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. ఆయన రాజీనామాతో బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేయడంతో అధికార పార్టీకి భారీ దెబ్బ తగిలింది. దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీ మంత్రులు జనవరి 12, జనవరి 13న రాజీనామాలు చేశారు.

Read More : Sankranthi Wishes: తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు..!

ఇక మౌర్య విషయానికి వస్తే…ఆయన కుమార్తె సంఘమిత్ర మౌర్య…బదౌన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి గెలుపొందారు. యూపీ రాజకీయాల్లో స్వామిప్రసాద్‌ మౌర్య సాధారణ నాయకుడు కాదు. బీఎస్‌పీలో మాయావతి కోర్‌టీమ్‌లో ఉండటమే కాకుండా, సుదీర్ఘకాలం పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. 2012, 2014లో మాయావతి పరాజయాల తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ వైపు వెళ్లారు. బీజేపీ విజయ దుందుభి మోగించడంతో స్వామిప్రసాద్‌ మౌర్యకు కేబినెట్‌ పదవి బహుమానంగా దక్కింది. ఆయన సీఎం యోగితో సన్నిహితంగా లేనప్పటికీ, కొన్ని నెలల కిందటి వరకు బీజేపీకి విధేయంగానే ఉన్నారు.

Read More : Narabali Case: నరబలి కేసులో మొండెం గుర్తించిన పోలీసులు.. హైదరాబాద్‌లోనే హత్య!

ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. స్వామిప్రసాద్‌ మౌర్య తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 20నియోజకవర్గాల్లో ఆయనకు గట్టి పట్టుంది. వెనుకబడిన తరగతుల ఓట్లలో 40 శాతానికి పైగా మౌర్య వెనకే ఉంటారనేది అక్కడి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఆయన రాజీనామా తర్వాత మౌర్య పేరు చెప్పుకునే మిగిలిన ఎమ్మెల్మేలు వలస బాట పడుతున్నారు.