UP Elections 2022: బీజేపీకి బిగ్ షాక్.. సైకిల్ పార్టీలోకి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు!

దేశ రాజకీయాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

UP Elections 2022: బీజేపీకి బిగ్ షాక్.. సైకిల్ పార్టీలోకి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు!

Mourya

UP Elections 2022: దేశ రాజకీయాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడంలో దిట్ట.. రాజకీయ శాస్త్రవేత్తగా పరిగణించే రామ్ విలాస్.. ఎప్పుడు ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతోందో ఎవరికి బలం ఉందో స్పష్టంగా చెప్పేసేవారు. అందుకే, గత నాలుగు దశాబ్దాల్లో పాశ్వాన్‌కు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడలేదు.

పాశ్వాన్‌ ఈ లోకంలో లేకపోయినా యూపీ రాజకీయాల్లో రామ్ విలాస్ అడుగుజాడల్లో నడిచే నాయకుడెవరైనా ఉన్నారంటే మాత్రం స్వామి ప్రసాద్ మౌర్య పేరు టాప్‌లో కనిపిస్తుంది. యూపీలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన పెద్ద నాయకుడిగా ఉన్న మౌర్య ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీలో చేరారు. బీజేపీకి ఎన్నికల ముందు ఇదో పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. దళితులు, OBCలు, రైతులు, నిరుద్యోగులు, చిరువ్యాపారులపై అణచివేతకు నిరసనగా తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మౌర్య.

స్వామి ప్రసాద్ మౌర్య పార్టీ విడిచిపోవడం వల్ల బీజేపీకి ఎన్ని సీట్ల నష్టం వాటిల్లుతుందో తెలియదు. కానీ, వెనుకబడిన తరగతుల ఓట్లలో 40 శాతానికి పైగా మౌర్య వెనకే ఉంటారనేది అక్కడి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు మాయావతి ఏనుగు నుంచి బలహీనవర్గాల ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ నాయకులు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. అందులో వారు విజయం సాధించడంలో మౌర్య కీలకంగా వ్వవహరించారు.

CM Jagan: సీఎం జగన్ గుంటూరు పర్యటన నేడే

ఒకప్పుడు జనతాదళ్‌తో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన స్వామి ప్రసాద్ మౌర్య BSPలో చేరినప్పుడు, మాయావతికి యాదవేతర OBCల ముఖ్యమైన నాయకుడిగా చెప్పారు. 2007లో ఆమె గెలుపులో OBC తరగతి ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మౌర్య, మాయావతి మాత్రమే మీడియాతో మాట్లాడేవారు.

ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా కూడా మౌర్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే ఆయన పార్టీ వీడినట్లుగా తెలుస్తోంది. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎం అయిన మొదటి రోజు నుంచే, స్వామి ప్రసాద్ మౌర్యకు ప్రాధాన్యత తగ్గించినట్లుగా అనుచరులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనా, పార్టీ అధినాయకత్వంపైనా మౌర్య అసంతృప్తి స్వరం అప్పటి నుంచే వినిపిస్తున్నారు.

Kodali Nani: వంగవీటి రాధ, కొడాలి నానికి కరోనా..

మౌర్యతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు.. బ్రిజేష్‌ ప్రజాపతి, రోషన్‌లాల్‌ వర్మ, భగవతి సాగర్‌, వినయ్‌ శాక్యలు కూడా కమలం పార్టీకి రాజీనామా చేశారు. అఖిలేష్‌ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఎస్పీ అధినేత అఖిలేశ్.