Sadhvi Prachi: స్వర భాస్కర్ వివాహంపై వీహెచ్‭పీ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

ఫిబ్రవరి 16న, స్వరా భాస్కర్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్పీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌తో తన వివాహాం జరిగినట్లు ప్రకటించారు. అనంతరం ఆమె స్పందిస్తూ ‘‘కొన్నిసార్లు మన పక్కనే చాలా అవకాశాలు పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. నిజానికి మనమంతా ప్రేమ కోసమే చూస్తున్నాం. ఫహాద్, నేను మొదట మంచి స్నేహితులం

Sadhvi Prachi: స్వర భాస్కర్ వివాహంపై వీహెచ్‭పీ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

Swara Bhasker should have seen the fridge: Sadhvi Prachi derogatory comments

Sadhvi Prachi: శ్రాద్ధ, నిక్కీ, మేఘ.. కపట ప్రియుల కత్తులకు బలై ముక్కలుగా రిఫ్రిజిరేటర్‭లో శవమై కనిపించిన యువతులు వీరు. ఇలాంటి దుర్మార్గాలు ఆడవారిపైనే కాదు, మగవారిపై కూడా జరుగుతున్నాయి. ఈ మూడు కేసులు దేశంలో సంచలనం సృష్టించిన అనంతరం, అస్సాంకు చెందిన ఒక మహిళ తన భర్తను అత్తను అలాగే హతమార్చి ముక్కలు చేసి ఫ్రిజులో పెట్టింది. అయితే ఇలాంటి ఉదంతాలను ఉదహరిస్తూ నటి స్వర భాస్కర్ మీద విశ్వ హిందూ పరిషత్ నేత (వీహెచ్‭పీ) సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే స్వర భాస్కర్ ఫ్రిజులో కనిపిస్తుందంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

TSRTC: ఒడిశా-తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం.. ఇరు రాష్ట్రాల మధ్య 23 బస్సులు

సాధ్వి ఇలా వ్యాఖ్యానించడానికి కారణం, ఆమె భర్త ముస్లిం వ్యక్తి కావడం. కొద్ది రోజుల క్రితమే సమాజ్‭వాదీ పార్టీ యువ విభాగానికి చెందిన ఫహాద్ అహ్మద్ అనే వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు హిందూ-ముస్లింలు రిజిస్ట్రార్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రాద్ధ వాకర్‭ను హతమార్చిన ఆమె బాయ్‭ఫ్రెండ్ అఫ్తాబ్ అహ్మద్ అనే వ్యక్తి ఇస్లాం మతానికి చెందినవాడు. దీంతో ముస్లింలను పెళ్లి చేసుకుంటే హతమార్చి ఫ్రిజులో పెడతారనే అర్థంలో సాధ్వి వ్యాఖ్యానించారు.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

ఒక టీవీ చానల్‭తో సాధ్వి మాట్లాడుతూ ‘‘స్వర భాస్కర్ ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆమె వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని ముందే తెలుసు. అనుకున్నట్లుగానే ఆమె ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమెకు మరో శ్రాద్ధ అవుతుందని నేను అనుకుంటున్నాను. శ్రాద్ధ లాగే ఆమె శరీరం కూడా 35 ముక్కులుగా ఫ్రిజులో దొరుకుతుంది. ఆమె ఇలాంటివి ఆలోచించిన తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది’’ అని అన్నారు.

Supreme Court: ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ పై ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఫిబ్రవరి 16న, స్వరా భాస్కర్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్పీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌తో తన వివాహాం జరిగినట్లు ప్రకటించారు. అనంతరం ఆమె స్పందిస్తూ ‘‘కొన్నిసార్లు మన పక్కనే చాలా అవకాశాలు పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. నిజానికి మనమంతా ప్రేమ కోసమే చూస్తున్నాం. ఫహాద్, నేను మొదట మంచి స్నేహితులం. ఆ తర్వాత ఒకరిపై మరొకరికి ప్రేమ కలిగింది. ఫహద్ జిరార్ అహ్మద్‭ను నా హృదయాంతరాలంలోకి ఆహ్వానించాను. ఇదంతా మీకు కాస్త అస్తవ్యస్తంగా కనిపించొచ్చు. అలాంటిదేమైనా కనిపిస్తే అది మీ అభిప్రాయమే!’’ అని అన్నారు.