దిశా ఘటన : కొనసాగుతున్న స్వాతి మలివాల్ నిరహార దీక్ష

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 03:23 AM IST
దిశా ఘటన : కొనసాగుతున్న స్వాతి మలివాల్ నిరహార దీక్ష

మహిళలపై లైంగిక దాడులకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషణ్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరహార దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపడుతున్నారు. దోషులకు కఠిన శిక్షలు విదించి..సత్వరమే వాటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల్లో దోషులకు శిక్ష వేయాలని వెల్లడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దిశా ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 03వ తేదీ మంగళవారం నుంచి ఆమె దీక్ష చేపట్టారు. రేపిస్టులను ఉరి తీసేలా వ్యవస్థ తీసుకొచ్చే వారకు తాన నిరవధిక దీక్ష కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 

ఫాస్ట్ ట్రాక్ కోర్టులున్నా వాటిని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం లేదని, నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరారు. గత సంవత్సరం నిరహార దీక్ష చేసినప్పుడు, మైనర్లపై దాడికి పాల్పడే వారికి ఆరు నెలల్లో కఠిన శిక్ష విధించేలా పది రోజుల్లోనే ప్రభుత్వం చట్టం చేయడం జరిగిందని, కానీ అమలు కాలేదని విమర్శించారు. మేం మీ వెంటే ఉన్నామని ప్రధాని భరోసా ఇవ్వాలని, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదన్నారు స్వాతి. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వీరు ఉంటున్న చర్లపల్లి జైలు వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యార్థి, మహిళా, ఇతర సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ప్రస్తుతం స్వాతి చేపడుతున్న దీక్షపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. 
Read More : నిత్యానంద దేశం