Swiggy: ఒక్కరోజే మూడున్నర లక్షల బిర్యానీలు.. న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో రికార్డు

శనివారం సాయంత్రం 10.25 గంటలలోపే 3.5 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇక ఇదే సమయంలోపు దేశవ్యాప్తంగా 61,000కుపైగా పిజ్జాల్ని కూడా డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.

Swiggy: ఒక్కరోజే మూడున్నర లక్షల బిర్యానీలు.. న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో రికార్డు

Swiggy: న్యూ ఇయర్ (డిసెంబర్ 31) సందర్భంగా శనివారం ఒక్క రోజే స్విగ్గీలో మూడున్నర లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం 10.25 గంటలలోపే 3.5 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.

India: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న భారత్.. లదాఖ్ ప్రాంతంలో ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణం

ఇక ఇదే సమయంలోపు దేశవ్యాప్తంగా 61,000కుపైగా పిజ్జాల్ని కూడా డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. సాయంత్రం 07.20 గంటలలోపే 1.65 లక్షల బిర్యానీలు స్విగ్గీ డెలివరీ చేసింది. శనివారం డెలివరీ అయిన ఆర్డర్లలో బిర్యానీదే అగ్రస్థానం. ట్విట్టర్‌లో స్విగ్గీ నిర్వహించిన ఒక పోల్‌లో 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకి ఆర్డర్లురాగా, లక్నోవీ బిర్యానీకి 14.2 శాతం, కోల్‌కతా బిర్యానీకి 10.4 శాతం ఆర్డర్లు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో బిర్యానీకి ఫేమస్ అయిన బావర్చి రెస్టారెంట్ శనివారం రోజు నిమిషానికి 2 బిర్యానీలు విక్రయించింది.

Nitish Kumar: ‘కొత్త జాతి పిత’ దేశం కోసం ఏం చేశాడు? మోదీపై నితీష్ కుమార్ విమర్శలు

మొత్తం 15 టన్నుల మాంసం వాడినట్లు స్విగ్గీ తెలిపింది. డొమినోస్ సంస్థ 61,287 పిజ్జాల్ని విక్రయించింది. శనివారం సాయత్రం ఏడు గంటల లోపు 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయని స్విగ్గీ వెల్లడించింది. స్విగ్గీ గ్రాసరీ సర్వీస్ అయిన ఇన్‌స్టామార్ట్ ద్వారా శనివారం 2,757 డ్యురెక్స్ కండోమ్ ప్యాకెట్లను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. అలాగే రాత్రి 09.18 నిమిషాలలోపు 12,344 కిచిడీ ఆర్డర్డు కూడా వచ్చాయని కంపెనీ వివరించింది.