Swiggy Fine : స్విగ్గీ జీఎస్టీ వేసింది.. భారీ ఫైన్ పడింది!

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy)కి షాక్ తగిలింది. కస్టమర్ నుంచి జీఎస్టీ వసూలు చేసినందుకూ భారీ మూల్యాన్ని చెల్లించింది.

Swiggy Fine : స్విగ్గీ జీఎస్టీ వేసింది.. భారీ ఫైన్ పడింది!

Swiggy Fined Rs 20k For Levying Rs 4.5 Gst On Soft Drink Bottles

Swiggy fined GST on soft drink bottles : ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy)కి షాక్ తగిలింది. కస్టమర్ నుంచి జీఎస్టీ వసూలు చేసినందుకూ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అనవసరంగా పన్ను విధించడమే కాదు.. వినియోగదారుడిని మానసిక వేధనకు గురి చేసినందుకు వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్‌ గార్గ్‌ స్విగ్గీ మొబైల్‌ యాప్‌ ద్వారా చీజ్‌ గార్లిక్‌ స్టిక్‌, మూడు సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఆర్డర్‌ చేశారు. గార్లిక్‌ స్టిక్‌కి రూ. 144 కాగా.. కూల్‌డ్రింక్స్‌కి రూ.90. బిల్‌ మాత్రం సాఫ్ట్‌డ్రింక్స్‌కి ప్రత్యేకంగా రూ. 4.50 GST వేసింది స్విగ్గి.. కొన్న వస్తువులపై MRP చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్‌డ్రింక్‌‌పై GST వసూలు చేసినట్టు గమనించాడు.

కన్సుమర్‌ గూడ్స్‌ యాక్ట్‌ 2006 (Customer Good Act) ప్రకారం.. చట్ట విరుద్ధమని పంచకుల వినియోగదారుల ఫోరాన్ని బాధితుడు ఆశ్రయించాడు. మధ్యవర్తులమేనని, సాఫ్ట్‌డ్రింక్‌ అమ్మకందారు పాలసీకి అనుగుణంగానే GST వసూలు చేసినట్టు వివరణ ఇచ్చింది. తమ సర్వీసుల్లో లోపం లేదంటూ పేర్కొంది. స్విగ్గీ వాదనలు విన్న ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్విగ్గీ ఏ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కాదని, వినియోగదారు, అమ్మకందారుల మధ్యవర్తిగా డెలివరీ పనులు నిర్వహిస్తోంది.

చట్ట విరుద్ధంగా సాఫ్ట్‌డ్రింక్‌పై GST రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా రూ.4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు, ఇతర ఖర్చుకుగాను అభిషేక్‌ గార్గ్‌కి పదివేలు చెల్లించాలని, పొరపాటుకు జరిమానాగా మరో పదివేలు హర్యానా స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చైల్డ్‌ వేల్ఫేర్‌కి డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.