క‌రోనా బాధిత చిన్నారుల్లో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు

  • Published By: bheemraj ,Published On : July 19, 2020 / 01:15 AM IST
క‌రోనా బాధిత చిన్నారుల్లో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు

క‌రోనా బాధిత చిన్నారులు కొంద‌రిలో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఢిల్లీ ఆస్ప‌త్రుల‌కు చెందిన ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. క‌వాసాకీ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి రావ‌డానికి క‌చ్చిత‌మైన కార‌ణం మాత్రం తెలియ‌ద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల‌ క‌రోనా పాజిటివ్‌తో ఢిల్లీలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చేరిన ప‌లువురు చిన్నారుల్లో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని వెల్లడించారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ క‌వాసాకీ వ్యాధి ఐదేళ్లలోపు చిన్నారుల్లో క‌నిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో తీవ్ర జ్వ‌రం ఉంటుంది. దాదాపు ఐదు రోజుల‌కుపైగా జ్వ‌రం ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కాగా, ఢిల్లీలోని క‌రోనా పాజిటివ్ వచ్చిన చిన్నారులు కొంద‌రిలో క‌వాసాకీని పోలిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా అది క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలే అని క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని వైద్యులు పేర్కొన్నారు.