టేబుల్‌ ఆకారంలో రన్‌వే.. విమానం కొంచెం పట్టుతప్పిన ప్రమాదమే!

10TV Telugu News

అచ్చం టేబుల్ ఆకారంలోనే ఉంటాయి ఈ రన్ వేలు.. విమానం దిగే సమయంలో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దిగాలి. కొంచె పట్టుతప్పినా వెంటనే జారిపోతాయి. టేబుల్ రన్వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలా కనిపిస్తుంది.. జాగ్రత్తగా విమానం దింపాలి.. ఏమాత్రం కొంచెం జరిగిన విమానం రన్వే నుంచి జారిపోతుంది.. ఇలాంటి రన్వేలనే టేబుల్ టాప్ రన్వే ఎయిర్ పోర్టులుగా పిలుస్తారు. కోలికోడ్ విమానాశ్రయం కూడా ఇలాంటిదే.

దేశంలోని లేహ్,మంగళూరు, కోలికోడ్ మానాశ్రయాలు టేబుల్టాప్ తరహకు చెందినవి. కొండల మధ్యలోని పీఠభూముల్లో నిర్మించారు. రన్వేకు ఒక పక్క గానీ లేదా రెండు వైపులా లోయలుంటాయి. సుదీర్ఘమైన వైమానిక రంగ అనుభవమున్న పైలట్లకు కూడా రన్వేలపై విమానాలను ల్యాండింగ్ చేయడం సవాల్ తో కూడుకున్న పని..2010లో కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతూ అదుపు తప్పింది.. రన్వే నుంచి వెళ్లి లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో 158 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టేబుల్ టాప్ రన్వే కోలికోడ్ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది.విమానం దిగుతుండగా కోలికోడ్ విమానాశ్రయంలో భారీగా వర్షం కురుస్తోంది. విమానం రన్వే దిగి జారుకొని వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. పైలట్‌కు మంచి అనుభవం ఉంది. టేబుల్ టాప్ రన్వే కావడంతో పాటు భారీ వర్షానికి విమానం రన్వే నుంచి కిందకు జారి ఉండొచ్చునని భావిస్తున్నారు.

10TV Telugu News