కేరళ విమాన ప్రమాదం : 9 సంవత్సరాల ముందే హెచ్చరించా..పట్టించుకొలే

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 12:18 PM IST
కేరళ విమాన ప్రమాదం : 9 సంవత్సరాల ముందే హెచ్చరించా..పట్టించుకొలే

కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. కానీ..విమానాశ్రయం, విమానాలు దిగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని 9 సంవత్సరాల క్రితం తాను తెలియచేయడం జరిగిందని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు, మాజీ పైలట్ అయిన..మోహన్ రంగనాథన్ వెల్లడించడం సంచలనం రేకేత్తిస్తోంది.



విమాన ప్రమాదానికి గల కారణాలను ఆయన వెల్లడించడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎత్తయిన కొండపై ఈ విమానాశ్రయం ఉండడం, రన్ వే కూడా చాలా చిన్నదిగా ఉంటుందని వెల్లడించారు. అంతేగాకుండా విమానాశ్రయం కింద రెండు వైపులా సుమారు 200 అడుగుల లోతున లోయలు కూడా ఉన్నాయన్నారు.

దీనితో పాటు…మరికొన్ని విషయాలను తాను 9 సంవత్సరాల క్రితమే ఆధారాలతో సహా తన రిపోర్టులో హెచ్చరించడం జరిగిందన్నారు. అయితే.. ప్రభుత్వం పట్టించుకోలేదని, దీన్ని సురక్షితమైనదిగా ప్రకటించిందన్నారు. ఇటీవలి కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బ తిన్నదని రంగనాథన్ వివరించారు.