Tailor’s Murder: 24గంటల పాటు ఇంటర్నెట్ బంద్, ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ

రాజస్థాన్ రాష్ట్రమంతా అలర్ట్ అయింది. 24గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక నెలరోజుల పాటు భారీ గుంపులు ఏవీ మోహరించకూడదని ఆంక్షలు విధించింది. ఇదంతా జరుగుతుండటానికి కారణం.. ప్రవక్తపై కాంట్రవర్సీ కామెంట్లు చేయడమేనని భావిస్తున్నారు.

Tailor’s Murder: 24గంటల పాటు ఇంటర్నెట్ బంద్, ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ

Rajsthan

Tailor’s Murder: రాజస్థాన్ రాష్ట్రమంతా అలర్ట్ అయింది. 24గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక నెలరోజుల పాటు భారీ గుంపులు ఏవీ మోహరించకూడదని ఆంక్షలు విధించింది. ఇదంతా జరుగుతుండటానికి కారణం.. ప్రవక్తపై కాంట్రవర్సీ కామెంట్లు చేయడమేనని భావిస్తున్నారు. ఈ అంశపైనే ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య జరిగిందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అల్లర్లు జరగకుండా జాగ్రత్తపడిన రాష్ట్రప్రభుత్వం 600 అదనపు బలగాలను తీసుకొచ్చింది. ఉదయ్‌పూర్ లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు.

ఈ ఘటనలో కన్హయ లాల్ అనే వ్యక్తిని హత్య చేశారు. షాపులోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో పలుమార్లు పొడవడంతో పాటు అతని గొంతును కత్తితో కోశారు. దాడి చేసిన వారే వీడియోను రికార్డ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తూ కామెంట్లు చేశారు. ఆ వీడియోలో దాడి చేయడానికి బాధితుడు వచ్చిన వారిలో ఒకరి బట్టలను కొలుస్తుండగా దారుణానికి ఒడిగట్టారు.

Read Also: రాజస్థాన్‌లో తీవ్ర‌ క‌ల‌కలం.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ నిలిపివేత‌

ఈ హత్య ఉదయపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్‌ లీడర్ రాహుల్ గాంధీ, ఇతర నాయకులు శాంతి వహించాలంటూ విజ్ఞప్తి సూచిస్తున్నారు.

“ఈ ఘటన వీడియోను షేర్ చేసి వాతావరణాన్ని పాడుచేయొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. వీడియోను షేర్ చేయడం ద్వారా, సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే నేరస్థుడి ఉద్దేశ్యం విజయవంతమవుతుంది” అని గెహ్లాట్ అన్నారు.

ఆ వీడియోను షేర్ చేయొద్దని కూడా పోలీసులు అభ్యర్థించారు. వీడియోలో అత్యంత ఉద్వేగభరితమైన కంటెంట్ ఉన్నందున దానిని ప్రసారం చేయవద్దని లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీనియర్ పోలీసు అధికారి హవాసింగ్ ఘుమారియా మీడియాను కోరారు.

ప్రవక్త మహమ్మద్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దేశ విదేశాల్లో పెద్ద వివాదాన్ని రేకెత్తించిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో గతంలో సపోర్ట్ ఇచ్చారు. ఫలితంగా కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు పోలీసులు తెలిపారు.