కరోనా దెబ్బకు తాజ్‌మహల్‌నూ మూసేశారు

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2020 / 01:46 AM IST
కరోనా దెబ్బకు తాజ్‌మహల్‌నూ మూసేశారు

ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్  ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని ఎవరూ సందర్శించకుండా మూసివేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి తాజ్ మహల్ ను మూసివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. టిక్కెట్లు ఇచ్చే అన్ని కట్టడాలు,ఇతర మ్యూజియంలను మార్చి-31వరకు మూసివేయాలని కోరినట్లు పర్యటాక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.

బయటదేశాల నుంచి వచ్చే పర్యాటకులపై ఇప్పటికే నిషేధం విధించింది కేంద్రం. యూరప్ సహా పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలను కూడా ఆపేశారు. టిక్కెట్లు ఇచ్చే అన్ని కట్టడాలు,ఇతర మ్యూజియంలను మార్చి-31వరకు మూసివేయాలని కోరినట్లు పర్యటాక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. గత నెలలో తాజ్ మహల్ ను అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే భారత్ లో దాదాపు స్కూల్స్,కాలేజీలు,సినిమా థియేటర్లు కరోనా దృష్ట్యా మూతపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 114కి చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కన్ఫర్మ్ చేసింది. భారత్ లో రెండు కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 142దేశాలకు పాకిన కరోనా…6వేల500మంది ప్రాణాలను బలిగొంది. 1లక్షా 70వేల మంది కరోనా సోకి ట్రీట్మెంట్ పొందుతున్నారు.