Tajmahal Secrets : తాజ్ మహల్ మిస్టరీ వీడేనా? ఆ 22 గదులు తెరవటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
శతాబ్దాల చరిత్ర కలిగిన తాజ్‌మహల్ తనలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలను దాచుకుంది. తాజ్మహల్లోని మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా... లేదంటే మరేవైనా ఉన్నాయా... అన్నది తెలియకపోయినా... బయట ప్రపంచం చూడని కొన్ని రహస్యాలను మాత్రం అక్కడ సమాధి చేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే.. ఆ గదులను తెరిచి చూడాల్సిందే !

Tajmahal Secrets : అందమైన అద్భుతమైన కట్టడం వెనుక అంతులేని మిస్టరీలెన్నో! ప్రేమకు చిహ్నంగా నిలిచిన నిర్మాణం వెనుక అంతపట్టని రహస్యాలెన్నో! శతాబ్దాల చరిత్ర కలిగిన తాజ్‌మహల్ తనలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలను దాచుకుంది. తాజ్మహల్లోని మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా… లేదంటే మరేవైనా ఉన్నాయా… అన్నది తెలియకపోయినా… బయట ప్రపంచం చూడని
కొన్ని రహస్యాలను మాత్రం అక్కడ సమాధి చేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే.. ఆ గదులను తెరిచి చూడాల్సిందే !
ప్రపంచంలోని కొన్ని వింతలు.. తమలో అంతుపట్టని రహస్యాలను కూడా దాచుకుంటాయి. ఆ మిస్టరీలను చేధించడం అనుకున్నంత సులభం కాదు. ప్రపంచ వింతల్లోనే కాదు.. అన్ స్వాల్వ్డ్ మిస్టరీల్లోనూ తాజ్‌మహల్ చోటు సంపాదించుకుంది. తాజ్‌మహల్ పునాదుల్లో కొన్ని గదులు ఉన్నాయి. వాటి లోపలికి వెళ్లడానికి ఒక ద్వారం ఉంది. కానీ.. దాన్ని ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ గదులను తెరవలేదు. దీనికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందుత్వవాదులు అక్కడ ఓ పెద్ద శివాలయమే ఉందని అంటుంటే… మరికొందరు అక్కడ ముంతాజ్ బేగం అసలైన సమాధి ఉందనే వాదనను వినిపిస్తున్నారు. ఇంకొందరేమో అంతులేని నిధులను అక్కడ భద్రంగా దాచిపెట్టారని బలంగా చెబుతున్నారు. ఇందులో ఎవరి వాదన కరెక్ట్ ? అందులో అసలేముంది ? అన్నది ఇంత వరకు మిస్టరీగానే మిగిలిపోయింది. ఆఖరికి ప్రభుత్వాలు కూడా ఆ గదులను తెరిచే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడీ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో… కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మిస్టరీ వీడుతుందేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also read : Tajmahal Secrets : తాజ్‌మహల్ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?!
తాజ్‌మహల్ నిర్మాణాన్ని వేలాది మంది కార్మికులు, కళాకారులు కలిసి నిర్మించారు. దీని నిర్మాణం 1632లో ప్రారంభించి సరిగ్గా 21 సంవత్సరాల్లో అంటే 1653లో పూర్తి చేశారు.ఈ అత్యద్భుత నిర్మాణంలో
ముంతాజ్ సమాధే ప్రధాన ఆకర్షణ. అందాలతో పాటు అడుగడుగునా ఎన్నో రహస్యాలు ఇందులో దాగున్నాయి. తాజ్ మహల్ లో ఉన్న పలు ఆర్చ్‌ల వెనుక చతురస్రాకారంలో సొరంగ మార్గాలు కూడా
ఉన్నాయన్నది కొందరి వాదన. వాటిని అనుసరిస్తే రహస్య గదుల్లోకి కూడా వెళ్లొచ్చట. అయితే ఆ గదులన్నీ పద్యవ్యూహంలా ఉంటాయని.. అందులోకి వెళ్తే తిరిగి బయటపడడం కష్టమన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే అందులోకి ఎవరూ వెళ్లకుండా ఇటుకలు, రాళ్లతో వాటిని సీజ్ చేశారని చెబుతారు. అంతేకాదు ఆ గదుల్లో పూర్తిగా గాడాంధకారం అలుముకుని ఉంటుందట. అందుకే ఆ గదుల్లోకి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసం చేయరని అంటుంటారు. ఈ వాదనలు ప్రచారాల్లో నిజమెంతో తెలియదు కానీ… తాజ్మహల్లోని రహస్య గదులపై చాలానే కథలు, ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి.
ఇక ముంతాజ్ సమాధి నిర్మించిన స్థానంలో ఒక పురాతన శివాలయం ఉండేదని, అయితే దాన్ని కవర్ చేస్తూ షాజహాన్ తాజ్ మహల్ నిర్మించాడని కొందరు చెప్తారు. ఆ సమాధి కింది భాగం లోపలి పెద్ద సొరంగ మార్గం ఉందని అందులో పెద్ద పురాతన విగ్రహాలు ఉన్నాయని కొందరు చెబుతారు. ఇప్పుడు కోర్టులో పిటిషనర్ కూడా అచ్చంగా ఇదే వాదన వినిపించారు. కొన్ని హిందూ సమూహాలు ఇప్పటికీ శివుడి తేజో మహాలయంగా తాజ్‌మహల్‌ను విశ్వసిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ తాజ్‌మహల్ లో రహస్య గదులున్నాయన్నది ఏ ఒక్కరూ నిర్దారించలేదు. అయినా అనంతపద్మనాభ స్వామి గుడిలో నేలమాళిగలు బయటపడిన స్థాయిలో తాజ్‌మహల్ రహస్య గదులపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. పద్మనాభస్వామి ఆలయంలో అంచనాలకు అందని స్థాయిలో బంగారం బయటపడింది. మరి ఈ తాజ్మహల్లోని రహస్య ద్వారాలు తెరిస్తే ఏం బయటపడుతుందన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజ్‌మహల్‌కు సంబంధించిన చారిత్ర ఆధారాలేవైనా బయటపడతాయా ? లేదంటే తాజ్‌మహల్ చరిత్రను తిరగరాసే ఆధారాలేవైనా బయటపడతాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also read : తాజ్‌మహల్ పేరు మార్పు ?
అంతా ఇక్కడో విషయం గమనించాలి. తాజ్‌మహల్‌లో మూసి ఉన్న గదులు పాలరాయితో కట్టారు. ఆ తలుపుల్ని చాల ఏళ్ల నుంచి తెరవలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఆ తలుపులు తెరిస్తే.. ఆ గోడలకు కార్బన్ డై ఆక్సైడ్ తగిలితే అది క్యాల్షియం కార్బొనేట్‌గా మారి పాలరాయి క్షీణిస్తుంది. తాజ్‌మహల్‌ని మోస్తున్న ఆ పునాది గదుల గోడలు బలహీనపడితే.. పెద్ద ప్రమాదం జరిగినా జరగొచ్చు. అదే జరిగితే ఆ నిర్మాణం కూలిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ గదులను తెరిచే సాహసం చేయడం లేదన్నది ఓ వాదన. అయితే ఈ వాదనను కూడా కొందరు కొట్టిపారేస్తున్నారు. ఆ గదుల్లో ఉన్న రహస్యాలు బయటపడకుండా చూసేందుకు ఇలాంటి కథలు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనా ఒక్క పిటిషన్‌తో దేశం చూపంతా తాజ్ మహల్‌పై పడింది.
- Ashish Mishra : లఖింపూర్ ఖేరి కేసు.. లొంగిపోయిన ఆశిష్ మిశ్రా
- Delhi High Court : సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ఉండాలి
- Chintamani drama AP HC : చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదు..నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?: ఏపీ హైకోర్టు
- AP High Court : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు
- AP High Court : పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్
1Telangana Covid Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
2IPL2022 Mumbai Vs SRH : రాణించిన రాహుల్ త్రిపాఠి.. ముంబై టార్గెట్ ఎంతంటే
3Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?
4Baarat Late: బారాత్ డ్యాన్స్‌తో లేట్ చేస్తున్నాడని మరొకరిని పెళ్లాడిన వధువు
5RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ
6MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్
7Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త
8Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
9Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!
10Karate Kalyani On ChildAdoption : చిన్నారిని దత్తత తీసుకున్నా అని చెప్పడానికి కారణమిదే-కరాటే కల్యాణి
-
Calcium Deficiency : పిల్లల్లో కాల్షియం లోపాన్ని నివారించటం ఎలాగంటే?
-
Corn Husks : గుండెకు మేలు చేసే మొక్క జొన్న పొత్తులు
-
Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్
-
Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
-
Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు