Taj Mahal : వెన్నెల అందాల్లో తాజ్ మహల్, నైట్ వ్యూయింగ్ డేట్స్

రోనా కారణంగా...2020, మార్చి 17వ తేదీ నుంచి పర్యాటకులను అనుమతించలేదు.

Taj Mahal : వెన్నెల అందాల్లో తాజ్ మహల్, నైట్ వ్యూయింగ్ డేట్స్

tajmahal

Taj Mahal : జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటి. ఆగ్రాలో దీనిని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు తరలివస్తుంటారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా..భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా ‘తాజ్ మహల్’ పేరు గడించింది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో ఈ కట్టడం రూపుదిద్దుకుంది. కానీ దీని అందాలను పగటిపూట చూడడం కంటే..రాత్రి వెన్నెల వెలుగులో చూడాలని అనుకుంటుంటారు.

Read More : Taliban : హైబతుల్లా ఎక్కడ ? చనిపోయాడా ?

కరోనా కారణంగా…2020, మార్చి 17వ తేదీ నుంచి పర్యాటకులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోకి వస్తుండడంతో తిరిగి సందర్శకులను అనుమతించేందుకు నిర్ణయించారు. రాత్రి వేళ..తాజ్ మహల్ ను చూసేందుకు అనుమతినిస్తూ…ఆగ్రా సర్కిల్ ఆర్కియాలజీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More : Facebook : కొత్త బిజినెస్.. తక్కువ వడ్డీతో రూ.50లక్షల వరకు లోన్లు

ఆగస్టు 21వ తేదీ నుంచి రాత్రి వేళ వీక్షించవచ్చని, ఆగస్టు 21, 24వ తేదీల్లో నైట్ వ్యూయింగ్ కు ఓకే చెప్పినట్లు ఆర్కియాలజీ విభాగం సూపరింటెండెట్ వసంత్ కుమార్ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 9.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10.00 గంటల నుంచి 10.30 గంటల వరకు స్లాట్ లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి స్లాట్ లో 50 మంది పర్యాటకులను మాత్రమే అనుమతినిస్తారు. టికెట్లను పొందేందుకు ఆగ్రాలోని 22 మాల్ రోడ్డు…ఏఎస్ఐ ఆఫీసు కౌంటర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.