గమనిక : పెరిగిన తాజ్ మహల్ వాంటేజ్ పాయింట్ వ్యూ రేట్లు

  • Edited By: madhu , December 7, 2019 / 04:12 AM IST
గమనిక : పెరిగిన తాజ్ మహల్ వాంటేజ్ పాయింట్ వ్యూ రేట్లు

తాజ్ మహల్…అందాలు తిలకించేందుకు భారతదేశం నుంచే కాకుండా..ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆగ్రాకు వస్తుంటారు. తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. మహల్ అందాలను వీక్షిస్తారు. పులకిస్తారు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ, రాత్రి వెన్నెల వెలుగుల్లో చూసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొత్తగా మెహతాబ్ బాగ్ దగ్గర తాజ్ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేసింది.

వెన్నెల వేళ..తాజ్ అందాలను చూడాలంటే…మధ్యాహ్నం 12 నుంచి అర్దరాత్రి 12 వరకు అనుమతినిస్తారు. మిగతా రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. అయితే..ప్రస్తుతం వీటి టికెట్ రేట్లు పెంచారు. ఎవరికైనా రూ. 20 ఉండేది. 12 ఏళ్లలోపు పిల్లలకు ఎంట్రీ ఉచితం. పౌర్ణమి రోజున ఇక్కడి నుంచి తాజ్‌ను చూడాలంటే..ఇండియన్స్ రూ. 200, విదేశీయులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. 

* మెహతాబ్ తాజ్ వ్యూ పాయింట్‌ను మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ ప్రారంభించారు. 
* వెన్నెల రాత్రుల్లో మెరిసిపోయే తాజ్ అందాలు చూసిన సందర్శకులు వావ్ అంటుంటారు. 
* రాత్రి వేళ చూడాలనే కల నెరవేరిందంటారు పర్యాటకులు. 
* మెఘల్ రాజుల కాలంలో నిర్మించిన తాజ్ మహల్ వద్ద గాలిని శుభ్రం చేసేందుకు ఆగ్రా జిల్లాల అధికారులు రెండు ఎయిర్ ఫ్యూరిఫై యంత్రాలను ఏర్పాటు చేశారు.
Read More : ఆమెకు న్యాయం జరిగేదెప్పుడు? : ఉన్నావ్ దీపం ఆరిపోయింది