వెన్నెల వెలుగుల్లో కూడా తాజ్ అందాలు చూడొచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2019 / 04:48 AM IST
వెన్నెల వెలుగుల్లో కూడా తాజ్ అందాలు చూడొచ్చు

ప్రపంచ వింతల్లో ఒకటి అయిన ఆగ్రాలోని తాజ్ మహల్ ను ఏటా కొన్ని కోట్ల మంది సందర్శిస్తుంటారు. భారతీయులే కాదు విదేశాల నుంచి వచ్చే అనేక మంది పర్యాటకులు తాజ్‌‌మహల్‌ను వీక్షిస్తూ తన్మయత్వంతో పులకించిపోతారు. అలాంటి తాజ్ అందాలను సూర్యుడు ఉదయిస్తున్న వేళ, రాత్రి వెన్నెల వెలుగుల్లో చూసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొత్తగా మెహతాబ్ బాగ్ దగ్గర తాజ్ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. సందర్శకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మెహతాబ్ బాగ్ తాజ్ వ్యూపాయింట్ ను యూపీ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ శుక్రవారం ప్రారంభించారు. 

ఉషోదయం సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నవేళ సూర్యకిరణాలు… అందాల తాజ్ మహల్ పై పడుతుంటే…ఆ సమయంలో మెహతాబ్ వ్యూ పాయింట్ నుంచి చూసిన సందర్శికులు మైరచిపోతున్నారు. అలాగే సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు వెన్నెల రాత్రుల్లో చంద్రకాంతిలో మెరిసిపోతున్న తాజ్ అందాలు చూసిన సందర్శకులు ఫిదా అవుతున్నారు.

తాజ్ సందర్శకుల కోసం ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీ నిర్మించిన వ్యూపాయింట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోందని మంత్రి ధర్మేష్ చెప్పారు. తాజ్ మహల్ దగ్గర గాలిని శుభ్రం చేసేందుకు ఆగ్రా జిల్లా అధికారులు రెండు ఎయిర్ ఫ్యూరిఫై యంత్రాలను ఏర్పాటు చేశారు.