Tajmahal Secrets : తాజ్‌మహల్‌ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?! | Tajmahal secrets..Ascertain If Taj Mahal Is 'Tejo Mahalaya'

Tajmahal Secrets : తాజ్‌మహల్‌ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?!

తాజ్‌మహల్‌ కొన్ని శతాబ్దాల కాలంగా అంతులేని రహస్యాలకు కూడా తనలో దాచుకుంది. ఇప్పుడు ఆ రహస్యాల గుట్టు విప్పాలన్న డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. తాజ్‌మహల్‌ ఒకప్పటి హిందూ దేవాలయమన్న వాదన మరింతగా బలపడుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఇంతకీ తాజ్‌మహల్‌లో ఏముంది? అది ఒకప్పుడు హిందూ దేవాలయమన్న వాదనలకు ఆధారాలేంటి ?

Tajmahal Secrets : తాజ్‌మహల్‌ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?!

Tajmahal Secrets :  అపురూపమైన ప్రేమకు చిహ్నంగా అనిపిస్తుంది. అంతేకాదు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి అందరిని ఆకట్టుకుంటోంది. అలాంటి తాజ్‌మహల్‌ కొన్ని శతాబ్దాల కాలంగా అంతులేని రహస్యాలకు కూడా తనలో దాచుకుంది. ఇప్పుడు ఆ రహస్యాల గుట్టు విప్పాలన్న డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. తాజ్‌మహల్‌ ఒకప్పటి హిందూ దేవాలయమన్న వాదన మరింతగా బలపడుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఇంతకీ తాజ్‌మహల్‌లో ఏముంది? అది ఒకప్పుడు హిందూ దేవాలయమన్న వాదనలకు ఆధారాలేంటి ?

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వివాదాలు చుట్టుముట్టడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్ల తాజ్‌మహల్‌ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతోంది. తాజ్‌మహల్‌ని మెుఘల్‌ చక్రవర్తి షాజహాన్‌, ముంతాజ్‌ ప్రేమకు చిహ్నాంగా చెప్పుకుంటారు. దీన్ని పర్షియన్, ఇండియన్, ఇస్లామిక్‌ శైలి మేలవించి నిర్మించారు. యుమునా నది ఒడ్డున తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఓ అద్భుతం. అయితే ఈ తాజ్‌మహల్‌ ముంతాజ్‌ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమన్న వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది. అసలు దీనిపేరు తాజ్‌మహల్‌ కాదని తేజో మహాలయ అన్న వాదనలు చాలానే ఉన్నాయి. నిజానికి 1666లోనే షాజహాన్‌ మరణించినా.. వివాదాలు మాత్రం సజీవంగానే మిగిలిపోయాయి. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. నాలుగు అంతస్థుల తాజ్‌మహల్‌లోని కింది రెండు అంతస్థుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసేశారు.తాజ్‌ మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెరిపించాలని…అందులో దాగివున్న రహస్యాలను బయటపెట్టాలని… అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జ్‌ రజనీష్‌ సింగ్‌ దాఖలు చేశారు.

అలహాబాద్‌ కోర్టులో వేసిన పిటిషన్‌తో మరోసారి తేనెతుట్టెపై రాయి విసిరినట్లైంది. మరోసారి దేశవ్యాప్తంగా తాజ్‌మహల్‌ హాట్ టాపిక్‌గా మారింది. పిటిషనర్‌ వాదన ప్రకారం తాజ్‌మహల్‌లోని మూసివేసిన 22 గదుల్లో ఏదో మిస్టరీ ఉంది. ఆ గదుల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు, గత చరిత్రకు సంబంధించి ఆధారాలు ఉండొచ్చనది అతని అనుమానం. అందుకే ఈ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అంటున్నారు. అంతేకాదు నిజాలు నిగ్గు తేల్చేందుకు యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా వేయాలని ఆయన కోరుతున్నారు. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో వచ్చిన యాత్రికులంతా తమ ప్రయాణ వివరణలో మాన్‌సింగ్‌ ప్యాలెస్ గురించి ప్రస్తావించారన్న విషయాన్ని కూడా పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తాజ్‌మహల్‌ 1653లో నిర్మించారని చెబుతారు.. అదే సమయంలో 1651లో నాటి ఔరంగజేబు రాసిన ఓ లేఖలో అమ్మి సమాధిని మరమ్మతు చేయాలని రాసుంది. ఇలాంటి వాస్తవాల ఆధారంగా తాజ్‌మహల్‌లోని మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరముందని పిటిషనర్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది.

చరిత్రకారుడు పీఎన్‌ ఓక్‌ రాసిన ట్రూ స్టోరీ ఆఫ్‌ తాజ్‌ అనే పుస్తకంతో అసలు వివాదం మొదలైంది. ఈ పుస్తకంలో తాజ్‌మహల్‌ కట్టడానికి పూర్వం అక్కడ ఓ శివాలయం ఉందని చెప్పడానికి చాలా వాదనలు అందులో ప్రస్తావించారు. అంతేకాదు తాజ్‌మహల్‌ ప్రధాన సమాధి కింద 22 రహస్య గదులు ఉన్నాయని.. కొందరు చరిత్రకారులు సైతం పేర్కొన్నారు. అయితే దాదాపు 45 ఏళ్ల క్రితం ఆ గదుల దగ్గరకు వెళ్లేందుకు ఓ మెట్లదారి తెరిచే ఉండేది. కానీ ఆ తర్వాత హఠాత్తుగా దాన్ని మూసివేశారు. దాన్ని ఐరన్‌ డోర్స్‌తో పూర్తిగా క్లోజ్ చేశారు.ఇప్పుడు బీజేపీ నేత పిటిషన్‌తో మరోసారి ఆ రహస్య గదులపై అందరి దృష్టి పడింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ అప్పట్లో ఓ నివేదిక కూడా ఇచ్చింది. అసలు దేనికి భద్రత. ఆ గదుల్లో అంత విలువైన వస్తువులు, విలువైన సమచారం ఏముంది ? శతాబ్దాల కాలంగా ఎందుకు ఆ గదులను రహస్యంగా ఉంచుతున్నారు ? బయట ప్రపంచానికి తెలియకుండా అక్కడ ఏం దాస్తున్నారు ? 22 గదులు తెరుచుకుంటే ఎవరికి ఇబ్బంది ? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వెతాకాల్సి ఉంది.

తాజ్‌మహల్‌ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాలను బీజేపీ తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సమాజంలో మతతత్వ బీజాలు నాటి ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్లాన్ చేస్తున్నారని విమర్శిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కమలం నేతలు తిప్పికొడుతున్నారు. ఏదైనా సమస్యపై కోర్టును ఆశ్రయించే హక్కు అందరికీ ఉంటుందన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించి న్యాయస్థానం చట్ట పరిధిలో నిర్ణయాలు తీసుకుంటుందని…. ఇందులో కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తోంది. మొత్తంగా చూస్తే మరోసారి అందమైన ప్రేమకట్టడం చుట్టూ మత వివాదం అలముకుంటోంది. అదే సమయంలో ఆ రహస్య గదుల్లో ఏముందో.. తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ కలుగుతోంది.

×