Kedarnath Helicopter Crash: ‘‘కూతురిని జాగ్రత్తగా చూసుకో.. ఆమె ఆరోగ్యం బాగోలేదు’’.. చివరిసారి భార్యతో ఫోనులో పైలట్

‘‘కూతురిని జాగ్రత్తగా చూసుకో.. ఆమె ఆరోగ్యం బాగోలేదు’’.. అంటూ ఓ పైలట్ చివరిసారిగా తన భార్యతో ఫోనులో మాట్లాడాడు. ఆ తర్వాతి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశాడు. ఉత్తరాఖండ్‌లోని ఫాఠా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ నిన్న కుప్పకూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆ పైలట్లలో అనిల్ సింగ్ (57) ఒకరు. ఆయన అంధేరీలోని పోష్ హౌసింగ్ సొసైటీలో నివసించేవాడు.

Kedarnath Helicopter Crash: ‘‘కూతురిని జాగ్రత్తగా చూసుకో.. ఆమె ఆరోగ్యం బాగోలేదు’’.. చివరిసారి భార్యతో ఫోనులో పైలట్

Kedarnath Helicopter Crash: ‘‘కూతురిని జాగ్రత్తగా చూసుకో.. ఆమె ఆరోగ్యం బాగోలేదు’’.. అంటూ ఓ పైలట్ చివరిసారిగా తన భార్యతో ఫోనులో మాట్లాడాడు. ఆ తర్వాతి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశాడు. ఉత్తరాఖండ్‌లోని ఫాఠా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ నిన్న కుప్పకూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆ పైలట్లలో అనిల్ సింగ్ (57) ఒకరు. ఆయన అంధేరీలోని పోష్ హౌసింగ్ సొసైటీలో నివసించేవాడు.

ప్రమాదానికి ఒకరోజు ముందు తన భార్య షిరీన్ ఆనందితతో ఫోనులో మాట్లాడుతూ తమ కుమార్తె ఫిరోజా సింగ్ ఆరోగ్యంపై ఆందోళన చెందాడు. ఈ విషయాన్ని షిరీన్ ఆనందిత మీడియాకు తెలిపింది. ‘‘సోమవారం ఆయన నాకు చివరిసారిగా ఫోన్ చేశారు. మా కుమార్తె ఆరోగ్యం బాగోలేదు. కుమార్తెను బాగా చూసుకోవాలని ఆయన నాకు చెప్పారు’’ అని చెప్పింది. అనిల్ సింగ్ స్వస్థలం తూర్పు ఢిల్లీలోని సహద్ర ప్రాంతం. ఆయన కుటుంబం గత 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..