Sonia Gandhi To PM: బ్లాక్ ఫంగస్ డ్రగ్ కొరతపై వెంటనే యాక్షన్ తీసుకోండి

ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ బ్లాక్ ఫంగస్ డ్రగ్ కొరతపై యాక్షన్ తీసుకోవాలంటూ లెటర్ రాశారు. విటల్ డ్రగ్ అయిన బ్లాక్ ఫంగస్

Sonia Gandhi To PM: బ్లాక్ ఫంగస్ డ్రగ్ కొరతపై వెంటనే యాక్షన్ తీసుకోండి

Sonia Gandhi To Pm

Sonia Gandhi To PM: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ బ్లాక్ ఫంగస్ డ్రగ్ కొరతపై యాక్షన్ తీసుకోవాలంటూ లెటర్ రాశారు. విటల్ డ్రగ్ అయిన బ్లాక్ ఫంగస్ (మ్యుకోర్మికోసిస్)ను ట్రీట్ చేయడానికి Amphotericin-B వాడతారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి.

వేల మంది కరోనా వైరస్ పేషెంట్లకు ఈ సమస్య వస్తుంది. ప్రాణాంతకమైన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో దేశం సమస్యల్లో ఇరుక్కుపోయింది. వర్చువల్ మీటింగ్ ద్వారా వారణాసి నుంచి పీఎం మోడీ హెల్త్ వర్కర్లను బ్లాక్ ఫంగస్ నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.

ఈ జబ్బు ఆయుష్మాన్ భారత్ స్కీంలో లేదంటూ పాయింట్ చేశారు. అలా చేయడం ఇండియాలో ఉండే పేదవారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందుతుందని వివరించారు. ‘పీఎం మోడీకి రిక్వెస్ట్ చేసేదేంటంటే.. మ్యూకోర్మికోసిస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెంటనే యాక్షన్ తీసుకోండి’ అంటూ సోనియా లెటర్ లో పేర్కొన్నారు.

ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం.. మ్యుకోర్మికోసిస్ ను కూడా చేర్చాలని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. దీనిని బట్టే తెలుస్తుంది ఆ బ్లాక్ ఫంగస్ ఎంత ప్రమాదకరోమో.. వారికి అందేలా మెడిసిన్ ఉత్పత్తి ఉండాలని ట్రీట్మెంట్ అవసరమున్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఐదు కంటే ఎక్కువ మంది మ్యాన్యుఫ్యాక్చరర్లకు Amphotericin-B ప్రొడక్షన్ కోసం లైసెన్స్ ఇచ్చింది. జులై నుంచి లక్ష 11వేల వయల్స్ రెడీ అవనున్నాయి. ఆ ఐదు కంపెనీలు NATCO Pharmaceuticals, హైదరాబాద్, Alembic Pharmaceuticals, వడోదరా; Gufic Biosciences Ltd, గుజరాత్; Emcure Pharmaceuticals, పూణె; Lyka గుజరాత్.