Jayalalithaa’s Home : జయలలిత నివాసం స్వాధీనం..ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుపడింది. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న జయలలిత నివాసాన్ని

Jayalalithaa’s Home : జయలలిత నివాసం స్వాధీనం..ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

Jaya Home

Jayalalithaa’s Home  దివంగత తమిళనాడు సీఎం జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుపడింది. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జయ మేనళ్లుడు జే.దీపక్,మేనకొడలు దీప మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో జయ నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.

కాగా,పోయస్ గార్డెన్ లోని జయ నివాసమైన “వేద నిలయం”ని జయ స్మారక చిహ్నంగా మార్చాలని గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. 2016 డిసెంబర్ లో జయలలిత మరణించగా..ఆమె మరణించిన కొద్ది నెలల తర్వాత 2017లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. 2020 జూలైలో, 0.55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని(జయ నివాసం) స్వాధీనం చేసుకోవడానికి అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం రూ. 67.9 కోట్లను సిటీ కోర్టులో డిపాజిట్ చేసింది.

జయలలిత ఇంటిని స్మారక చిహ్నంగా మార్చే బాధ్యత మరియు హక్కు పార్టీకి ఉందని, అది తమిళనాడు ప్రజలు,అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల ‘హృదయపూర్వక కోరిక’ అని అన్నాడీఎంకే పేర్కొంది. అయితే జయలలిత చట్టపరమైన వారసులుగా కోర్టు ప్రకటించిన జయలలిత మేనకోడలు మరియు మేనల్లుడు అన్నాడీఎంకే ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. స్వాధీనం చేసుకోవడం ఆస్తిని “దోపిడీ” చేయడమే అవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ఇవాళ మద్రాస్ హైకోర్టులో విచారణకు రాగా..జయ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది.

ALSO READ Kerala Mother : అమ్మ ప్రేమ గెలిచింది..ఆ బిడ్డ అనుపమ బిడ్డే