UP : తాలిబన్లకు యూపీ సీఎం వార్నింగ్

అప్ఘాన్ దేశాన్ని వశం చేసుకున్న తాలిబన్లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తాలిబన్ల వల్లే పాక్, అప్ఘాన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.

UP : తాలిబన్లకు యూపీ సీఎం వార్నింగ్

Up Cm Taliban

Airstrike Is Ready UP CM : అప్ఘాన్ దేశాన్ని వశం చేసుకున్న తాలిబన్లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియా దిశగా ఆ మూకలు కదిలివస్తే…వారిపై వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా తయారైందన్నారు. ఇండియా వైపు ఏ దేశం కన్నెత్తి చూడలేదని, తాలిబన్ల వల్లే పాక్, అప్ఘాన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. లక్నోలో సామాజిక్ ప్రతినిధి సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు.

Read More : Key Meeting : నవంబర్‌ 3న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక సమావేశం

తాలిబన్ల వల్ల…పాక్ దేశంతో పాటు అప్ఘాన్ దేశం తీవ్ర క్షోభను అనుభవిస్తున్నాయని, ఆ ఉగ్రమూక ఇండియా వైపు వస్తే..దాడులు తప్పవని హెచ్చరించారు.  రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఆయన చురకలంటించారు. సమాజ్ వాదీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలు ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, రామభక్తులను చంపిన వారు దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. కొంతమంది తమ కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని, వైద్య కళాశాలకు మహారాజ సుహెల్ దేవ్ పేరు పెట్టిందన్నారు.

Read More : Corona third wave: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా

హెల్దేవ్ కోసం ప్రతిపక్షం ఏమి చేసిందని ప్రశ్నించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇక్కడ పాగా వేసేందుకు పలు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా..ఆ పార్టీ పెద్దలు ఇప్పటినుంచే ప్రచారం మొదలు పెట్టారు.