Taliban Crisis: ఆఫ్ఘన్‌లో హిందూ-సిక్కుల భద్రతకు తాలిబన్ల భరోసా!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల సంక్షోభంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పూర్తిగా ఆఫ్ఘన్ తాలిబన్ల హస్తాల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రజలు..

Taliban Crisis: ఆఫ్ఘన్‌లో హిందూ-సిక్కుల భద్రతకు తాలిబన్ల భరోసా!

Taliban Crisis

Taliban Crisis: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల సంక్షోభంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పూర్తిగా ఆఫ్ఘన్ తాలిబన్ల హస్తాల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని హిందువులు, సిక్కులు, భారతీయులు భయాందోళన మధ్య మన దేశానికి వచ్చేందుకు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఈక్రమంలోనే ఓ మూడువందల మంది సిక్కులు, హిందువులు ఓ గురుద్వార్ లో ఆశ్రయం పొందుతున్నారు. అది తెలుసుకున్న తాలిబన్లు వారిని సంప్రదించి వారి భద్రతకు భరోసా ఇచ్చారు.

మూడు వందలకు పైగా హిందువులు, సిక్కులు కాబూల్‌లోని కార్టే పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం తెలుస్తున్న తాలిబన్లు వారిని కలిశారు. తాలిబన్ నాయకులు భద్రత గురించి వారికి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని అకాలీదళ్ ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో రాజకీయ, సైనిక మార్పులు జరుగుతున్నప్పటికీ హిందువులు, సిక్కులు సురక్షితమైన జీవితాన్ని గడపగలరని మేము ఆశిస్తున్నామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న హిందువులు, సిక్కులకు సహాయ సహకారాలు అందిస్తామని MEA హామీ ఇచ్చిందని.. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాబూల్‌లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పిన ఆయన భారతదేశానికి తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను తాను అర్థం చేసుకున్నామని.. కానీ, విమానాశ్రయ కార్యకలాపాలు ప్రధాన సవాలుగా ఉందని.. ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన మంగళవారం ట్వీట్‌లో తెలిపారు. తాము ఆఫ్ఘన్, సిక్కు, హిందూ సంఘాల ప్రతినిధులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని.. వారి భద్రతను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.