Afghanistan-India Trade : భారత్ తో ఎగుమతులు,దిగుమతులు నిలిపేసిన తాలిబన్

ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను

Afghanistan-India Trade : భారత్ తో ఎగుమతులు,దిగుమతులు నిలిపేసిన తాలిబన్

Taliban (3)

Afghanistan-India Trade ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను పూర్తిగా నిలిపివేసిందని ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ తెలిపింది. బుధవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ..మొన్నటి వరకు అప్ఘానిస్తాన్ నుంచి మన దేశానికి దిగుమతలు పాకిస్తాన్ మార్గం గుండా వచ్చేవని,అయితే తాలిబన్.. అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా సరుకు రవాణాను నిలిపివేశారని, తద్వారా ఆ దేశం నుండి దిగుమతులు పూర్తిగా నిలిపివేయబడ్డాయని చెప్పారు. అప్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు అజయ్ సహాయ్ తెలిపారు.

కాగా,అప్గానిస్తాన్-భారత్ మధ్య సుదీర్ఘ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వాణిజ్య మరియు పెట్టుబడుల విషయాల్లో ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి. అప్ఘానిస్తాన్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది. అప్ఘానిస్తాన్ కి భారత్ ఎగుమతి చేసే వాటిలో.. చక్కెర, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు మరియు ట్రాన్స్ మిషన్ టవర్లు ఉన్నాయి. అప్ఘానిస్తాన్ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునేది డ్రై ఫ్రూట్స్‌. ఇవే కాకుండా నుండి కొద్ది మొత్తంలో గమ్ మరియు ఉల్లిపాయలను కూడా అప్ఘానిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది.

2021లో అప్ఘానిస్తాన్ కి భారత్ ఎగుమతులు విలువ 835 మిలియన్ డాలర్లు. 510 మిలియన్ డాలర్ల విలువైన సరుకులను అప్ఘానిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. వాణిజ్యం మాత్రమే కాకుండా అప్ఘానిస్తాన్‌లో భారత పెట్టుబడులు భారీగానే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారు 3 బిలియన్లు డాలర్లు భారత్ ఇన్వెస్ట్(పెట్టుబడి)చేసింది. అలాగే, అఫ్ఘానిస్తాన్‌లో 400 ప్రాజెక్టులు భారత్ చేపట్టగా..వాటిలో కొన్నింటి పనులు ఇంకా జరుగుతున్నాయి.

అయితే భారత్ నుంచి అప్ఘానిస్తాన్ కి కొన్ని వస్తువులు అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ మార్గం నుండి ఎగుమతి చేయబడుతుంటాయని.. ఇది ఇప్పుడు బాగానే ఉందని అజయ్ సహాయ్ చెప్పారు. కొన్ని వస్తువులు దుబాయ్ మార్గం ద్వారా కూడా అప్ఘానిస్తాన్ కి భారత్ నుంచి ఎగుమతి చేయబడతాయని..ఇది కూడా ఇప్పుడు పనిచేస్తుందని ఆయన చెప్పారు.

READDry FruitsPrices:తాలిబాన్ల చెరలోఅఫ్గాన్..ఇండియాలో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు