Afghanistan : అప్ఘాన్‌‌లో తాలిబన్లు, భారత్‌‌పై ఎఫెక్ట్..వీటి ధరలు పెరుగుతాయా ?

అప్ఘాన్ ను తాలిబన్లు కైవసం కేసుకోవడంతో భారతదేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.

Afghanistan : అప్ఘాన్‌‌లో తాలిబన్లు, భారత్‌‌పై ఎఫెక్ట్..వీటి ధరలు పెరుగుతాయా ?

Taliban

Taliban Takeover In Afghanistan : అప్ఘాన్ ను తాలిబన్లు కైవసం కేసుకోవడంతో భారతదేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. వాణిజ్యంలో అనిశ్చితి కారణంగా…అప్ఘాన్ నుంచి దిగుమతి చేసుకొన్న కొన్ని వస్తువుల ధరలు భారతీయ మార్కెట్ లలో పెరగవచ్చని సీఐఏటీ (CAIT) అగ్ర ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. తాలిబన్లు అప్ఘాన్ ను స్వాధీనం చేసుకోవడంతో దిగుమతి, ఎగుమతుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. భారీ మొత్తంలో చెల్లింపుల్లో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, పలు వ్యాపారాలు ప్రమాదస్థితికి వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో..ప్రస్తుత పరిస్థితిని గుర్తించి…వ్యాపారులకు ఖచ్చితమైన మద్దతు అందచేయాల్సిన అవసరం ఉందని సీఏఐటీ వెల్లడిస్తోంది.

Read More : Salima Mazari: సలీమా మజారీ-తాలిబాన్లను ఎదిరించిన మహిళా గవర్నర్.. చివరిక్షణం వరకూ

ఎండుద్రాక్ష, ఫైన్ గింజలు, నేరేడు పండు, పిస్తా, ఎండుద్రాక్ష, బాదం, వాల్ నట్స్, ఎండిన ఆప్రికాట్, చెర్రి, పుచ్చకాయతో పాటు మరిన్ని ఔషధ మూలికలను భారత్ కు ఎగుమతి చేస్తోంది అప్ఘాన్. టీ, కాఫీ, పత్తి, మిరియాలు, పాదరక్షలు, బొమ్మలను అప్ఘాన్ కు భారత్ దిగుమతి చేస్తోందని సీఏఐటీ జాతీయ అధ్యక్షులు బిసి భారతీయ వెల్లడించారు. ఇండియా – అప్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా..2020-21 సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్లు, 2019-20 1.52 బిలియన్ డాలర్ల వ్యాపారం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని అంచనా.

Read More : Srisailam : శివోహం, భక్తులకు సర్వదర్శనాలు

అప్ఘాన్ కు భారత ఎగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లు కాగా..దిగుమతులు 2020-21 సంవత్సరంలో 510 మిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో…భారతీయ మార్కెట్ లలో ధరలు పెరిగే ఛాన్స్ ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. అప్ఘాన్ తో ఏదోఒక రోజు వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయే అవకాశాలున్నాయని, అనిశ్చితి తగ్గిన తర్వాతే…ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఓ కొలిక్కి వస్తాయని సీఏఐటీ భావిస్తోంది. ఎందుకంటే…ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా వాయుమార్గం ద్వారా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిర్ స్పేస్ పై పూర్తిగా నిషేధం ఉన్నట్లు తెలుస్తోంది.